కనిగిరి జలాశయ బాధితులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
ఇటీవల కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన బాలురు నందు, చందు కుటుంబ సభ్యులకు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అండగా నిలిచారు.
ఇటీవల బాధిత కుటుంబాన్ని పరామర్శించి 1 లక్ష ఆర్థిక సహాయం చేసిన ఆమె… వారి కుటుంబ పరిస్థితిని గమనించి మరో లక్ష అదనపు సహాయం అందించి ఆదుకున్నారు.
ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో చిన్నపడుగుపాడులో వారి ఇంటికి వెళ్లిన పెన్నా డెల్టా ఛైర్మన్ గోపిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు మదన్‌రెడ్డి, ఇతర నాయకులు.. మృతుల తల్లిదండ్రులు గోవిందయ్య, శేషమ్మకు ఆర్థిక సహాయం అందించారు.
బాధిత కుటుంబానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని, ఎలాంటి ఇబ్బందులు తమ దృష్టికి తీసుకురావాలని వారికి భరోసా ఇచ్చారు. మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు బాధిత కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.