కఠిన శ్రమకు దక్కిన ఫలితం: బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నియామకంపై జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ హర్షం
నెల్లూరు, జూలై 1, 2025 – భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షులుగా శ్రీ పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల నెల్లూరు బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన సంఘటన్ పర్వ్‌లో మాధవ్ నియామకం రాష్ట్రంలో పార్టీకి కొత్త ఉత్తేజాన్నిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, పీవీఎన్ మాధవ్ నాయకత్వ లక్షణాలను, పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని కొనియాడారు. “ఒక సాధారణ బీజేపీ కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర అధ్యక్ష స్థానానికి ఎంపిక అయ్యే వరకు శ్రీ పీవీఎన్ మాధవ్ ప్రయాణం యువ తరానికి స్ఫూర్తిదాయకం. ఇది కఠిన శ్రమకు దక్కిన ఫలితం,” అని ప్రవీణ్ కుమార్ అన్నారు.
“మాధవ్ విద్యారంగంలో అపార అనుభవం ఉన్నవారు. ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానం, నిబద్ధత పార్టీ శ్రేణులకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని, ప్రజలకు మరింత చేరువవుతుందని విశ్వసిస్తున్నాను,” అని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.దూరదృష్టి, వ్యూహాత్మక ఆలోచనలతో పార్టీకి నూతన దిశ మాధవ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అవగాహన కలిగి ఉన్నారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
“ఆయన దూరదృష్టి, వ్యూహాత్మక ఆలోచనలు రాష్ట్ర పార్టీని ముందుకు నడిపిస్తాయి. యువతకు, మహిళలకు ఆయన నాయకత్వం ఒక దిశానిర్దేశం చేస్తుంది,” అని ఆయన అన్నారు.శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి నుంచి బాధ్యతలు స్వీకరించిన మాధవ్ నాయకత్వంలో, రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కొత్త అధ్యక్షుల ఎన్నిక జరిగిందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, భవిష్యత్తులో పార్టీని సొంతంగా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఇది కీలక అడుగు కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.
2029 లో బూత్ స్థాయి బలోపేతమే కీలకంగా ఆయన సమర్థ నాయకత్వంలో పార్టీ మరింత విస్తరిస్తుందని అన్నారు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, అందరినీ కలుపుకుని సమన్వయంతో పని చేస్తూ.. భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ,” అవకాశవాదం, వారసత్వ రాజకీయాలు లేకుండా కార్యకర్తలు నిర్మించిన పార్టీ బీజేపీ అని గుర్తుచేస్తూ, ఎన్నో ఎన్నికల సవాళ్లను అధిగమించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీదని,బూత్, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారనీ,, పేర్కొన్నారు.