*కండలేరు ముంపు నిరుద్యోగులు అసమ్మతితో రగిలిపోతున్నారు*
అధికారుల నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు
. ….. మిడతల రమేష్

కండలేరు ముంపు గ్రామాలకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ జీవితాలు నాశనం అయిపోతున్నాయని. యువశక్తి ప్రభుత్వం వైపు ఎదురుచూస్తూ తమ బ్రతుకులు నిర్వీరమైపోతున్నాయని ముంపు నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ పేర్కొన్నారు
తెలుగు గంగ_కండలేరు జలాశయం నిర్మాణ సమయంలో తమ గ్రామాలు త్యాగం చేసిన ముంపు వాసులు *అప్పుడుదేవుళ్ళు లాగా*_జీవోల ప్రకారం అర్హులైన వారికి ఉద్యోగము లేదా నష్టపరిహారం అడుగుతుంటే *ఇప్పుడు భూతాలు లాగా* అధికారులకు కనిపిస్తున్నారని రమేష్ అన్నారు .

దాచూరు .నెల్లేపల్లి. కొలప నాయుడు పల్లి .నెర్నూర్ గ్రామాలకు చెందిన ముంపు అవార్డు దారులు 607 మంది ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించనా సంబంధిత అధికారులు న్యాయస్థానాలకు కనీసం జవాబు(కౌంటర్) ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని బహిర్గతం చేస్తుంది. .
అధికారుల నిర్లక్ష్యం *కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేదిలా ఉంది*.

బ్రిటిష్ ప్రభుత్వం కాలం 1854 నుండి నీటిపారుదల రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు లస్కర్లు మ్యాన్ మస్దూర్లు గేట్ ఆపరేటర్లు ఓవర్ సీర్స్ .లాంటి శాశ్వత ఉద్యోగాలు 2010 వరకు ఉన్నాయి. వారి రిటైర్మెంట్ తర్వాత. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోఎనిమిది వందలకు పైగా ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అధికారులు ముంపు వాసులకు ఉద్యోగాలు ఇవ్వరు.. జలవనూరుల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోరు ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు. రిజర్వాయర్లు. కెనాల్సు నిర్వీర్యంగా మారుతున్నాయి. అధికారుల తీరు మార్చుకొని జీవోల ప్రకారం ఉద్యోగము లేదా పరిహారము ఏదో ఒక నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *