*కండలేరు డ్యామ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయండి*
కండలేరును పర్యాటక కేంద్రంగా మార్చడంలో టూరిజం డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తుంది
తుంగభద్ర డాం ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతోపర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసినట్లు కండలేరు జలాశయాన్ని కూడా అభివృద్ధి చేయాలి
బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ తెలుగు గంగా ఎసి కి వినతిపత్రం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
కండలేరు డాం వద్ద పర్యాటక రంగానికి తగినంత స్థలం ఉంది. ఇప్పటికే జింకల పార్కు. ఆలయం. ఖాళీగా తెలుగు గంగ క్వార్టర్స్ అందుబాటులో ఉన్నాయి .
ఈ ప్రాంతంలో రిసార్ట్స్. స్విమ్మింగ్ పూల్. బోట్ షికారు. చిన్నపిల్లలు వినోదభరితంగా ఆడుకునే వసతులు కల్పించినట్లయితే రాష్ట్రంలో ముఖ్యమైన పర్యాటక రంగం గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది
*తుంగభద్ర డ్యామును పర్యాటక రంగం గా మార్చిన తర్వాత ప్రతి ఏడు రెండు కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తూ ఉంది* .
కండలేరు జలాశయాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే పర్యావరణ వనరులు మరియు జీవవైవిద్యం పరిరక్షింపబడుతాయి. స్థానికంగా ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామంతో నైనా పర్యాటక కేంద్రంగా మార్చాలని మిడతల రమేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి నీలి శెట్టి లక్ష్మణరావు నారాయణ యాదవ్ రాముల యాదవ్ కల్లు భాస్కర్ ఏవి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు