ఐ లవ్ నెల్లూరుని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తాం
: నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు చెరువు మీద ఎన్టీఆర్ నెక్లేస్ ఘాట్ నిర్మించే అదృష్టం నాకు దక్కింది.
మంత్రి నారాయణ సహకారంతో నుడాను నెంబర్ వన్ గా గతంలో తీర్చిదిద్దాను. హరిజనవాడలో కూడా ఆహ్లాదకరమైన పార్క్ ని నిర్మించాం
పుట్టిన నేల కోసం ఏదో ఒకటి చెయ్యాలనే తపన నాలో ఉంది. అందుకే ఎన్టీఆర్ నెక్లేస్ ఘాట్ ఐ లవ్ నెల్లూరు బోర్డు ఏర్పాటు చేశాను
ఐ లవ్ నెల్లూరుకి భారీ స్పందన వచ్చింది.. వైసీపీ వచ్చిన తరువాత ఆ నినాదాన్నే పక్కన పెట్టేసారు
జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధుల సహకారంతో నుడాను అభివృద్ధి చేస్తా..
తిక్కన సోమయజీ దగ్గర నుంచి పుచ్చలపల్లి సుందరయ్య, పొననా కనకమ్మ వంటి మహనీయులను గుర్తు చేసేలా వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తాం
అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్, కాలేజీ, ప్రభుత్వ ఆఫీస్ ల వద్ద ఐ లవ్ నెల్లూరు బోర్డు ను ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నాం..
నెల్లూరోళ్లకు ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఈ బోర్డులు ఏర్పాటు చెయ్యమని కోరుతున్నాం..
నెల్లూరుని శుభ్రంగా ఉంచుకుందామనే భావన అందరిలోనూ రావాలి.. దానికోసమే నా తపన
క్లిన్ అండ్ గ్రీన్ లో, అభివృద్ధిలో నుడాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం
పెన్నా నది, నెల్లూరు చెరువు, మైపాడ్ బీచ్, ఉదయగిరి కోట, ప్రసిద్ధి ఆలయాలను మరింత అభివృద్ధి చేసుకుందాం.. ఐ లవ్ నెల్లూరు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం
కొన్ని ఆఫీస్ లకు, ప్రభుత్వ స్కూల్స్ కి నుడా తరపునే బోర్డులు స్పాన్సర్ చేస్తాం
MIG లేవుట్స్ లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం
త్వరలోనే ఆ లేవుట్స్ లో తాగునిరు, కరెంట్, రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం.. వైసీపీ హయాంలో నుడాని నాశనం చేశారు..
సొంత ప్రయోజనాలు కోసం నుడాని వాడుకుని ప్రజలను ముప్పుతిప్పలు పెట్టారు
కలెక్టర్ ఆనంద్, మంత్రి నారాయణ సహకారంతో నుడా తరపున ఎక్కువ MIG లేవుట్స్ వేస్తున్నాం. తక్కువ ధరకే ప్రజలకు మంచి ప్లాట్స్ ని అందుబాటులోకి తెస్తాం
కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మంచి లేవుట్ వేస్తున్నాం.. ఎవ్వరికి నష్టం లేకుండా చూస్తాం.. ఈ విషయంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు
నెల్లూరు సిటిలో ట్రాఫిక్ తగ్గించేలా ఆత్మకూరు బస్టాండ్ ని వేరే చోటుకు మారుస్తాం.. మంత్రి నారాయణ ఆలోచనలు కూడా అవే
రోడ్లు పరిశుభ్రంగా ఉండేందుకు అవసరమైతే నేనే చీపురు పట్టుకుని రోడ్డు మీదకి వస్తాను
ఐ లవ్ నెల్లూరు అనే కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చెయ్యాలి, నుడాను ప్రక్షాళన చేస్తున్నాం..