*ఐదేళ్లూ రైతుల్ని నట్టేట ముంచి ఇప్పుడు పరామర్శల పేరుతో డ్రామాలా*
*అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా మిర్చి రైతుల కష్టాలను పట్టించుకున్నారా*
*మిర్చి దొంగల బ్యాచ్ తో రైతుల పరామర్శకు వెళతావా జగన్ రెడ్డీ..*
*రైతుల కోసం ఎవరి ప్రభుత్వం హయాంలో ఏం చేశారో చర్చకు సిద్ధమా..*
*తెలుగు సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుల కొరత తీర్చే పనిలో వైసీపీ*
*ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా జ్ఞానోదయం కాలేదు*
*అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
ఈ రోజు జగన్ రెడ్డి కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను పరామర్శించేందుకు వెళ్లాడా…డ్రామాలు వేసేందుకు వెళ్లాడా
నిజంగా రైతులను పరామర్శించేందుకు వెళితే అక్కడ ఇచ్చిన నినాదాలేంటి…ఆ డాన్సులేంటి..ఆ చిందులేంటి
చివరగా లేళ్ల అప్పిరెడ్డి మనుషులు 14 బస్తాల మిర్చి బస్తాలను ఎత్తుకెళ్లిపోయారంట
మిరప కాయల దొంగలతో జగన్మోహన్ రెడ్డి మిర్చియార్డుకు పోవడం హాస్యాస్పదం
అమ్మఒడి రాలేదంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూలు చిన్నారితో ఒక డ్రామా వేయించారు
ఎక్కడికి వెళ్లినా పేటీఎం బ్యాచ్ తో డ్రామాలు వేయించడమే పనిగా పెట్టుకున్నారు
వైసీపీ పాలనలో మిర్చి రైతులను నల్ల తామర తెగులు నలిపేసింది…కష్టాల్లో ఉన్న రైతులను ఆ రోజు మంత్రులు కానీ, సీఎం కానీ పరామర్శించారా
వ్యసాయ శాఖను జగన్మోహన్ రెడ్డి మూత వేసిన విషయం వాస్తవం కాదా
రాయలసీమ ప్రాంతానికి అత్యంత అవసరమైన బిందు తుంపర్ల సేద్యాన్ని మూలనపెట్టలేదా
2017-18లో రూ.2300 కోట్ల నిధులతో బిందు తుంపర్ల సేద్యంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపాం
అదే సంవత్సరం వ్యవసాయ యాంత్రీకరణకు కూడా రూ.650 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు అండగా నిలిచాం
నేలకు ఎంతో అవసరమైన సూక్ష్మ పోషకాల సబ్సిడీని 50 శాతం నుంచి 100 శాతంకు పెంచి పూర్తిగా ఉచితంగా ఇచ్చాం
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటిని ఆపేసిన జగన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది
వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీని దేశంలోనే మూడో స్థానంలో నిలిపారు. జనాభా ప్రాతిపదికన చూస్తే ఏపీదే అగ్రస్థానం
కౌలు రైతుల ఆత్మహత్యల విషయంలోనూ అదే పరిస్థితి
దేశంలో సగటు రైతు అప్పు రూ.74500 వేలుగా ఉంటే ఏపీలో మాత్రం రూ. 2.45 లక్షలు
ధాన్యం కొనుగోలు చేస్తే ఆర్నెళ్లకు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు
జీవోఎంఎస్ 22 ప్రకారం 2020లో మిర్చికి ఇచ్చిన గిట్టుబాటు ధర క్వింటాలుకు రూ.7 వేలు..2023లోనూ అదే ధర
ఈ రోజు క్వింటాలు మిర్చి రూ.13 వేలు వరకు పలుకుతోంది..రోజుకు రూ.400 నుంచి రూ.500 పెరుగుతోంది
అయినా కూడా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవబోతున్నారు
గతంలో పదేపడే ఢిల్లీ టూర్లు వేసిన జగన్ రెడ్డి ఏ రోజైనా కేంద్రంతో రైతుల గురించి మాట్లాడారా
కేసులు, బెయిళ్లు, జైల్లు తప్ప రైతులు, ప్రజల సమస్యలను ఏ రోజైనా పట్టించుకున్నారా
2017లో మిర్చి ధర తగ్గితే రైతులకు క్వింటాలుకు రూ.1500 ఇన్సెంటివ్ ఇచ్చాం..వైసీపీ పాలనలో ఎప్పుడైనా అలా జరిగిందా
ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతుల విషయంలో అనేక దారుణాలకు పాల్పడ్డారు
డ్రిప్ ఇరిగేషన్ కు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుంటే ఆ పథకాన్ని ఏపీలో ఎందుకు ఆపేశారు
రైతులను నిండా ముంచిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మిర్చి యార్డుకు వెళ్లి డాన్సులు, చిందులు, డ్రామాలు వేయడం విడ్డూరంగా ఉంది
యల్లహంక ప్యాలెస్ నుంచి రావడం,..రెండు రోజులు షో చేయడం..తిరిగి ప్యాలెస్ కు వెళ్లడం..ఇదే జగన్ రెడ్డి రొటీన్ షెడ్యూల్ గా మారిపోయింది
తెలుగు సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుల కొరత తీర్చేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తున్నట్టోంది
మగోళ్ల అందం గురించి జగన్మోహన్ రెడ్డి వర్ణించడంపై ఆయన పక్కన ఉండే బ్యాచ్ లోనే చర్చ జరుగుతోందంట
భారతమ్మ స్పందించి జగన్ రెడ్డికి మంచి సైకియాట్రిస్ట్ కు చూపితే బాగుంటుందేమో
ప్రజలు ముఖం మీద కొట్టి 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత కూడా ఆయనకు ఇంకా జ్ఞానోదయం కాదా
కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు కూడా గడవక ముందే జగన్మోహన్ రెడ్డి రోడ్లపైకి వచ్చి డ్రామాలేస్తుంటే ప్రజలే సహించడం లేదు
ఇలా డ్రామాలు వేయడం కాదు..ఏ విషయంలో అయినా చర్చకు రావాలి
కరువు పరిస్థితులు నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి రైతులను ఆదుకునే ప్రయత్నాలు చేయాలి
కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కరువు మండలాలతో తమకు సంబంధం లేదని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి సెలవిచ్చారు
ఆక్వా రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించుకుంటే జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు
టీడీపీ హయాంలో ఐఎస్ఐ మోటార్లను ఉచితంగా రైతులకు అందించే పథకానికి శ్రీకారం చుడితే 2019లో ప్రభుత్వం మారగానే ఆపేశారు
2014-19, 2019-24 మధ్య, తిరిగి ఇప్పుడు రైతుల కోసం ఎవరు ఏం చేశారనే అంశాలపై చర్చించేందుకు సిద్ధం
జగన్మోహన్ రెడ్డి రెడ్డే వస్తారా.. కన్నబాబును పంపుతాడా..లేక చర్చకు కాకాణిని దింపుతాడా..మేం రెడీ
దయచేసి వేషాలు వేసేందుకు రైతుల వద్దకు వెళ్లవద్దని జగన్ రెడ్డికి హితవు పలుకుతున్నాం