*ఐదు సంవత్సరాలలోపు ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించిన కమిషనర్*

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక ప్రభుత్వ సర్వజన ప్రధాన ఆసుపత్రి ప్రాంగణం మెటర్నిటీ విభాగంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు.

ఐదు సంవత్సరాలలోపు ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు.

నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో అవకాశం ఉన్న ఏ ప్రాంతంలోనైనా చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కమిషనర్ సూచించారు.

పోలియో మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు చేపట్టిన పాల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ సుజాత, నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి కనకాద్రి ,డి.ఐ.ఓ డాక్టర్ ఉమామహేశ్వరి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed