*ఐకమత్యంగా వుండండి – గ్రామాభివృద్ధికి పాటుపడండి*

– పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.
– అనుమతి లేకుండా గ్రావెల్ దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
– ఉచిత ఇసుక తోలకమైన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకే..
– అక్రమార్కులను ప్రోత్సహించను, అవినీతి రహిత కోవూరు సాధనే నా లక్ష్యం.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా వున్నారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. పున్నూరు గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి ఆమె స్థానిక నాయకులతో చర్చించారు. పున్నూరు గ్రామంలో నిరుపయోగంగా వున్న దొరువును స్థానిక అవసరాల కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేసి గ్రామ పంచాయతికి స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ పున్నూరు – లేబూరు గ్రామస్థుల అభ్యర్ధన మేరకు అధ్వానంగా వున్న లింకు రోడ్డును అత్యవసర అవసరాల కోసం దాదాపు 5 లక్షలు వెచ్చించి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తాత్కాలికంగా నిర్మించామన్నారు. ఎంపి లాడ్స్ ద్వారా కానీ లేదా పంచాయతి రాజ్ నిధులు ద్వారా కానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్డును పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా కల్వర్టు నిర్మాణం కూడా చేపట్టి వాహన రాకపోకలకు ఆటంకం లేకుండా చేస్తానన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పున్నూరు – మూలపాడు వాసులు స్మశానం కోసం కొన్న భూమిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ నిధుల మంజూరుచేయిస్తానన్నారు. పున్నూరు, ఉపాధి హామీ పధకం భాగంగా ఆమె టెంకాయ మొక్కలను నాటి టెంకాయ చెట్లు పెంచే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ మూలపాడు, అంకమ్మ సత్రం, ఎస్సి, ఎస్టీ కాలనీలలో మీ 700 కొబ్బరి చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపడతామని 4 సంవత్సరాల తరువాత కొబ్బరి చెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ అవసరాల కోసం వినియోగించుకునే వెసలుబాటు కల్పిస్తామన్నారు. గ్రామ నాయకులు స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటేనే రాజకీయంగా మనుగడ సాధించగలరని సూచించారు. విభేదాలను పక్కన పెట్టి గ్రామాభివృద్ధికి పాటు పడవలసిందిగా ఆమె స్థానిక నాయకులకు హితోపదేశం చేశారు. అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేస్తే సహించేది లేదన్నారు. ఇసుక, గ్రావెల్ ఏవైనా సరే అధికారుల అనుమతితో పగలు మాత్రమే తోలుకోవాలని ఆమె సూచించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత కోవూరుకు తూట్లు పొడిచి తనకు చెడ్డ పేరు తేవద్దని నాయకులను కోరారు.ఈ కార్యక్రకమంలో ఇందుకూరుపేట మండల టిడిపి అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర నాయుడు, జిల్లా టిడిపి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ చెంచుకిషోర్ యాదవ్, సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, స్థానిక నాయకులు చంద్రమోహన్ రెడ్డి, చిట్టిబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *