*ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో స్పందన అద్భుతం — ఆదాల హిమబిందు*

*ఏ నోట విన్న అదే మాట వైసీపీకే మా ఓటు అంటున్న ప్రజలు — ఆదాల హిమబిందు*

*19వ డివిజన్లో ఆదాల హిమబిందు విస్తృత ఎన్నికల ప్రచారం*

*ఆదాల హిమబిందుకు అపూర్వ ఘన స్వాగతం*

గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో చాలా మంచి స్పందన కనిపిస్తుందని, ఏ గడపకు వెళ్లిన, ఏ నోట విన్నా మా మద్దత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డికి వేస్తామని స్వయంగా ప్రజలు చెప్పడం పట్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాల లబ్ధి ప్రతి ఇంటికి నేరుగా చేరిందనేది స్పష్టం అవుతుందని *రూరల్ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు చెప్పారు*. నాన్నగారు 9 నెలల కాలంలో చేసిన అభివృద్ధిపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుందని, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మంచి మెజారిటీతో ఘనవిజయం సాధిస్తారని ప్రజలు నుండేభరోసా నేరుగా వస్తుందని ఆదాల హిమబిందు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ అరవింద నగర్ ఎక్స్టెన్షన్, రామిరెడ్డి కాలువ వీధి తదితర ప్రాంతాల్లో నెల్లూరు వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దత్తుగా ఆయన కుమార్తె ఆదాల హిమబిందు శుక్రవారం సాయంత్రం ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గార్లను మంచి మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను ఆదాల హిమబిందు కోరారు. ఇంటింటా ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆదాల హిమబిందుకు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. *నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి దిశనిర్దేశంలో* తనదైన శైలిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దత్తుగా ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆదాల హిమబిందు చేపట్టారు.ఈ కార్యక్రమంలో 19 ఇన్ఛార్జ్ పచ్చా రవి, డివిజన్ వైసీపీ సీనియర్ ముఖ్య నాయకులు జల్లి కుమార్, కొండేటి శివారెడ్డి, నగర పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి, క్లస్టర్ -1 అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి, కొండేటి రఘురామిరెడ్డి, కే.సుకుమార్ రెడ్డి, ముత్యాల విజయలక్ష్మి, ఎర్రజల్ల శివ, పట్టపు మల్లి, మోహన్ కృష్ణ, సతీష్, రాఘవ, దుంపల రాము, పి శ్రీనివాసులు, వెంకటరమణ, గడ్డం కృష్ణారెడ్డి, వైవి రామసుబ్బారెడ్డి, అనితమ్మ, పార్వతి, తదితరుల తోపాటు నగర పార్టీ మహిళ అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మిసునంద, ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, టిఎల్ఎఫ్ అధ్యక్షురాలు నండూరి హరిత రెడ్డి, ముంగమూరు భార్గవి రెడ్డి, పాశం వెంకటేష్, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *