నెల్లూరు జనవరి 11

*ఏసీ సెంటర్లో మదీనా వాచ్ వారు అభివృద్ధి చేస్తున్న పార్క్, వాటర్ ఫౌంటెన్ పరిశీలించిన మంత్రి నారాయణ*

నెల్లూరు నగరంలో 24 పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు:

శనివారం సాయంత్రం ఏసీ సెంటర్లో మదీనా వాచ్ వారు అభివృద్ధి చేస్తున్న పార్క్, వాటర్ ఫౌంటెన్ మంత్రి నారాయణ పరిశీలించారు.

నగరంలో మరి కొన్ని ఫౌంటెన్లను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ వారి కుమారులను మంత్రి అభినందించారు. వారిని ఆదర్శంగా తీసుకుని సక్సెస్ఫుల్ వ్యాపారులు కన్ట్రాక్టర్లు ముందుకు వచ్చి సేవా భావంతో పార్కు ల అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోరారు .

అభివృద్ధి చేస్తున్న పార్కులను ప్రైవేటు వారి సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ పార్కుల్లో అవసరమైన క్రీడా పరికరాలు ఎక్విప్మెంట్ సి ఎస్ ఆర్ ఫండ్స్ నుంచి ఏర్పాటు చేస్తామన్నారు .

ఈ పార్క్ ల నిర్వహణ సేవాభావం ఉన్న ప్రైవేటు వారికి ఇస్తామన్నారు.నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మోడల్ సిటీగా రూపొందించాలని 14 -19 లో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తదితర పనులు చేపట్టామని తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసిందన్నారు.

ఈ కార్యక్రమంలో రంగ మయూర్ రెడ్డి,,కార్పొరేటర్ ప్రశాంత్,విజయ భాస్కర్ రెడ్డి ,మదీనా వాచ్ అధినేతలు,పలువురు నాయకులు పాల్గొన్నారు.

నెల్లూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *