*ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు వైసీపీ దూరమైందా, జగన్ ఎక్కడ కూర్చుంటారు*
ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే
ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది.
క్యాబినెట్ హోదా కలిగి ఉండడంతో పాటు పీఎస్, పీఏ సహా సిబ్బంది, అలవెన్సులు, తదనుగుణమైన ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది.
సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షానికి ప్రాధాన్యం ఉంటుంది.
మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు.
వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని అనుసరించే ఉంటుంది.
*జగన్ సంగతేంటి?*
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీకి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి.
కానీ తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో జగన్‌కి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు.
*ఆయనకు సభలో ఎక్కడ సీటు కేటాయించాలనే విషయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారు*