ఢిల్లీః
19-5-2024
ఆదివారం.

(జన హుషార్)
ఢిల్లీలో చింతా మోహన్, కేంద్ర మాజీ మంత్రి & కాంగ్రెస్ సీనియర్ నేత ప్రెస్ కాన్ఫరెన్స్

• ఏపిలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు.

• ఏపిలో జగన్, మోడి వ్యతిరేక పవనాలు చాలా స్పష్టంగా కనిపించాయి.

• జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుకూల పవనాలు కనిపించాయి.

• చంద్రాబాబు బిజెపితో పెట్టుకుని పొరపాటు చేశారు.

• బిజెపితో పొత్తు ఉండడం మూలంగా చంద్రబాబుకు స్థానాలు తగ్గుతాయి.

• లోకపోతే చంద్రబాబు కు 150 స్థానాలకు పైగా వచ్చేవి.

• ఖచ్చితంగా జగన్ ఓడిపోవడం ఖాయం.

• జగన్ ను పెంచిపోషిస్తున్న మహా ఘనుడు మోడి పతనం కూడా ప్రారంభమైంది.

• దేశవ్యాప్తంగా బిజేపికి150 స్థానాలకు మించి రావు.

• కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.

• మోడి, జగన్ లు ఇంటికి పోవడం ఖాయం.

• జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు లాభించింది.

• జగన్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ సొంతం చేసుకోలేక పోయింది. చంద్రబాబుకు పడ్డాయి.

• అయుతే, కాంగ్రెస్ పార్టీ 2029 లో ఏపిలో అధికారంలోకి వస్తుంది.

• రత్నాలు ఏమీ జగన్ కు పనిచేయలేదు. డబ్బులే పనిచేశాయి.

• ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటే, జగన్ కు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఐపోయింది.

• అయ్యో…జగన్ ఓడిపోతున్నాడు అనే బాధ ప్రజల్లో లేదు.

• మనది మంచి ప్రజాస్వామ్య దేశం.

• మన ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి.

• అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేశారు.

• జరిగిన ఎన్నికల్లో ఒక చిన్న రాష్ట్రంలో, ఏపిలో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

• జాతీయ పార్టీ అయున కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంత పెద్దమొత్తంలో 5 శాతం కూడా ఖర్చు చేయలేక పోయింది.

• ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎన్నికల్లో పంపిణీ కోసం జగన్మోహన్ రెడ్డి ఎలా తెచ్చారు!?

• ఇందుకోసం, జగన్మోహన్ రెడ్డికి పద్మశ్రీ, పద్మ విభూషణ్ పురస్కారం ఇవ్వాలి .

• ఇది ఎలా సాధ్యమైందో సంబంధిత సంస్థలే చెప్పాలి.

• తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఒక అసెంబ్లీ స్థానంలో అధికార వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్ధి సుమారు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

• ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది….!?

• తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఎస్.సి అసెంబ్లీ స్థానం గూడూరు లో అధికార పార్టీ అభ్యర్ధి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

• ఈ డబ్బును ఓ హోటల్లో పెట్టి పోలీసు అధికారి పంపిణీ చేశారు.

• తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలోనే 200 నుంచి 300 కోట్ల రూపాయలు, అధికార వైసిపి ఖర్చు చేసింది.

• అన్నీ తెలిసి కూడా, వ్యవస్థలన్నీ విఫలమైపోతున్నాయి.

• ఎన్నికల సంఘం పూర్తిగా బలహీన పడిపోతోంది.

• దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే, దొంగతనాలు చేస్తుంటే, పోలీసు వ్యవస్థ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది…!?

• పోలీసులు మమ్మల్ని సాక్ష్యాలు అడిగారు. ఎవరిస్తారు?

• అధికారంలోకి వచ్చేందుకు
వైసిపి ఇలా అవినీతి, అక్రమాలు
చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed