
*ఎస్ 2 సినిమా హాలు వద్ద మరుగుదొడ్లు, ఇతర నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేసిన కమిషనర్ వై. ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక సిరి సినిమా హాల్ సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
ప్రాంగణంలోని మరుగుదొడ్లు, ఇతర నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు.
అనంతరం స్థానిక ఎస్ 2 సినిమా హాల్ సమీపంలో డ్రైను కాలువల నిర్వహణ తీరును పరిశీలించారు.
రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ సమీపంలోని పంపింగ్ హౌస్ తనిఖీ చేసి పనితీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాహంతు జానీ, సిబ్బంది పాల్గొన్నారు.