*ఎవ్వరూ నష్టపోకుండా పగడ్బందీగా సర్వే : నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెల్లడి*
జిల్లా పరిధిలోని అన్ని లేఔట్లలో భౌతిక సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడి..
మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఇప్పటికే 17 ప్రత్యేక బృందాలు నెల్లూరులో సర్వే చేస్తున్నట్లు తెలిపిన కోటంరెడ్డి
లే అవుట్ లో ప్రభుత్వాన్ని నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్న కోటంరెడ్డి
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న లేఔట్లలో పట్టణ ప్రణాళిక అధికారులు ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. నుడా కార్యాలయంలో అధికారులతో అయన సర్వే మీద ప్రత్యేకంగా చర్చించారు. నుడా పరిధిలోని అన్ని లేఔట్లను భౌతికంగా సర్వే చేపట్టి వాటిని ప్రయోగాత్మకంగా అధ్యయనం నిర్వహించి.. గ్రామ మరియు నగర స్థాయిలో లేవుట్ల నిబంధనల యొక్క అమలును పరిశీలించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టుగా మంత్రి నారాయణ ఆదేశాల మేరకు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సర్వే వల్ల అనధికార లేఔట్స్ కి ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. లేవుట్ యజమానులు, ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ఎవరికి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు మాత్రమే సాంకేతికత ఆధారంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వే ప్రణాళిక మరియు విధానపరమైన నిర్ణయాలు కోసం మాత్రమే అధికారులు నిర్వహిస్తున్నారని.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనధికార లేఔట్స్ కి.. ఈ సర్వే కి ఎలాంటి సంబంధం లేదని.. స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో చేస్తున్న ఈ సర్వే ఆధారంగా వచ్చిన ఫలితాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి జిల్లాలో శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేడీ మహాలక్ష్మి దొర, ఆర్డి సంజీవ్, సీపీఓ హిమబిందు, సెక్రటరీ పెంచల్ రెడ్డి తదితరులు ఉన్నారు