
*ఎల్.ఆర్.ఎస్ పధకం ద్వారా లేఔట్ ను క్రమబద్ధీకరించే అవకాశాలను, అనుమతులను పరిశీలించి పలు సూచనలు జారీ : కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక 1వ డివిజన్ నవలాకులతోట ప్రాంతంలోని లేఔట్ ను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.
ఎల్.ఆర్.ఎస్ పధకం ద్వారా లేఔట్ ను క్రమబద్ధీకరించే అవకాశాలను, అనుమతులను కమిషనర్ పరిశీలించి టౌన్ ప్లానింగ్ అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు.
అనంతరం స్థానిక 12వ డివిజన్లోని శ్రీకరం లేఔట్ ను ఎల్.ఆర్.ఎస్ అనుమతుల కోసం కమిషనర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ హిమబిందు, డి సి పి రఘునాథరావు, ఏ.సీ.పి. మురళి,వార్డు సచివాలయ కార్యదర్శులు, లేఔట్ యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు.