*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు*

– ఇందుకూరుపేట, గంగపట్నం, ముదుర్తి పాలెం, పాటూరు, వేగూరు మరియు ఇనమడుగు గ్రామాలలో పునరవాస కేంద్రాల ఏర్పాటు.
– అధికారులతో కలిసి సహాయక చర్యలలో పాల్గొంటున్న స్థానిక టిడిపి నాయకులు.
– నియోజకవర్గ వ్యాప్తంగా పునరవాస కేంద్రాలలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మొంథా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కోవూరు నియోజకవర్గంలోని పల లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటూ సహాయక చర్యలపై అధికారులు మరియు నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాలతో ఇందుకూరుపేట మండలంలోని ముదిర్తిపాలెం గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను స్థానిక హై స్కూల్ కు తరలించి భోజన వసతులు కల్పించారు. టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, దాసరి విజయ్ కుమార్ స్థానిక అధికారులతో కలిసి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇందుకూరు పేట మండలం గమ్మల్లపాలెం మరియు ఇందుకూరుపేట గ్రామ హరిజనవాడ, అరుంధతి వాడలలోని వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు. కోవూరు మండలం వేగూరు సర్పంచ్ అమరావతి ఆధ్వర్యంలో వేగూరులోని ముంపు ప్రాంత వాసులకు సమీపంలోని పాఠశాలలో పునరవాసం కల్పించారు. ఇనమడుగు, పాటూరు, నార్త్ రాజుపాలెం వినాయక కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక టిడిపి నాయకులు అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైతే స్థానిక నాయకుల సహకారం తీసుకుని ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed