*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ఆహ్వానం*
బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో జరుగుతున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఆలయ కమిటి సభ్యులు ఆహ్వానించారు.
నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఆమె నివాసంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక అందించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే విశేష సేవలు యితర ధార్మిక కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వివరించారు.
ఈ ఆహ్వాన కార్యక్రమంలో ఆలయ కమిటి ఛైర్మన్ కేశవరావు, సభ్యులు కళ్యాణ్, బాలు తదితరులు పాల్గొన్నారు.