*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జోక్యంతో ఆగిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల తరలింపు*

ఇందుకూరుపేటలో మరియు గండవరం ప్రాంత వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించాలంటే కోవూరు వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఇందుకూరు పేట, గండవరం గ్రామాలలో వున్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలను కోవూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో విలీనం చేయాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి జోక్యంతో రద్దయింది. ఇందుకూరుపేట, గండవరంలలో వున్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల విలీనం ఆపాలని ఆ ప్రాంత ప్రజానీకం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గారిని కలిసి ఇందుకూరుపేటలో మరియు గండవరం గ్రామాలలో వున్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు కోవూరుకు తరలిస్తే ఆ ప్రాంత రైతులు ఎదుర్కునే సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి అభ్యర్థనకు స్పందించిన విద్యుత్ శాఖా మంత్రి విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు విలీనం ఆపాలని శాఖా పర ఆదేశాలిచ్చారు. విషయం తెలుసుకున్న ఆ ప్రాంత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విలీనాన్ని రద్దు చేస్తూ ఇందుకూరుపేట, గండవరంలలో వున్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు యధాతధంగా కొనసాగేలా కృషి చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గార్లకు ధన్యవాదాలు తెలియ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *