*ఎన్‌ఐఓటి సందర్శించిన వి.ఎస్.యూ ప్రతినిధులు…*
*అవగాహన ఒప్పందం కోసం చర్చలు : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు*
…………………….
సోమవారం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ, మెరైన్ బయాలజీ విభాగ అధ్యాపకులు డాక్టర్ ఎం. హనుమా రెడ్డి, డాక్టర్ చి. వెంకట్రాయులు, సహాయక రిజిస్ట్రార్ డాక్టర్ సుజయ్ కుమార్ లు చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటి)ను సందర్శించారు.
ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటి) మధ్య సముద్ర పరిశోధన, సాంకేతికత రంగాలలో సహకార అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు మరియు అధ్యాపకులు ఎన్‌ఐఓటి ఆధునిక సౌకర్యాలను ఉపయోగించి పరిశోధనలు చేయగలరు.
అదేవిధంగా, ఎన్‌ఐఓటి నిపుణుల మార్గదర్శకత్వంలో మెరైన్ బయాలజీ, సముద్ర సాంకేతికతలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. ఈ సహకారం సముద్ర వనరుల వినియోగం, పరిరక్షణలో నూతన పరిజ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించగలదు.
ఈ సందర్శనలో, ఎన్‌ఐఓటి బృందం సభ్యులు ప్రొఫెసర్ బాలాజీ రామకృష్ణన్ (డైరెక్టర్, ఎన్‌ఐఓటి), డాక్టర్ జి. ధరణి (సైంటిస్ట్ మరియు మెరైన్ బయోటెక్నాలజీ డివిజన్ అధిపతి), డాక్టర్ ఎన్.వి. వినీత్ కుమార్ (సైంటిస్ట్-ఎఫ్, కోఆర్డినేటర్, డీప్ ఓషన్ మిషన్), డాక్టర్ వి. సచితానందం (సైంటిస్ట్-ఇ, సభ్యుడు, డీప్ ఓషన్ మిషన్), డాక్టర్ వి.ఎన్.ఎస్. దేవిరామ్ గర్లపాటి (సైంటిస్ట్-డి, సభ్యుడు, డీప్ ఓషన్ మిషన్) పాల్గొన్నారు. వారు సముద్ర పరిశోధనలో తాజా అభివృద్ధులు, సాంకేతికతకు సంబంధించిన విషయాలపై ప్రాముఖ్యతనిచ్చారు.
విద్యార్థులకు సముద్ర పరిశోధన రంగంలో అనుభవాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుందని, ఈ భాగస్వామ్యం భవిష్యత్‌లో మరింత విస్తరించే అవకాశముందని తెలిపారు.