*ఎంపీ వేమిరెడ్డిని , మాజీ మంత్రి అనిల్ లను అరెస్టు చేయమని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి. వినతి పత్రం అందజేశిన ఆర్.పి.ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు*
……. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనిన అనంతరం కలెక్టరేట్లో ఈ సందర్భంగా పాత్రికేయులు తో ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు మాట్లాడుతూ.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ లను అదుపులోకి తీసుకుని విచారణ జరిపించండని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కలిసి సోమశిల కండలేరు కాలువ విస్తీర్ణ సోమశిల ఉత్తర కాలువ విస్తీర్ణ పనులకు ఇతర కాంట్రాక్టర్లు ను భయపెట్టి టెండర్లు వేయనియాకుండా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సింగల్ టెండర్ వేసి ఒకే వ్యక్తికి వచ్చే విధంగా.1300. కోట్లు అధిక ఎస్టిమేషన్లు వేసి ఆ వర్కుల్లో దాదాపు 400 కోట్లు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు .
మరియు గూడూరు సైదాపురం క్వాడ్జ్ ల్లో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కనుక వారిద్దరిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి విచారణ జరిపిస్తామని అన్నారు దోచుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేసేదాకా ఆర్ పి ఐ పార్టీ పోరాటాలు చేస్తుందని అన్నారు .
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోలుబోయిన అనిల్ కుమార్ అను ఇద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని అన్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధుల భరతం పడతామని మండిపడ్డారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తల మధుసూదన్ దుంపల సుబ్బారావు గారు పట్టపు రంగారావు నిమ్మల సుబ్బయ్య గారు తదితరులు పాల్గొన్నారు