*ఎంపి, ఎమ్మెల్యే అనే అయిదు అక్షరాలు ప్రజాసేవకే అంకితం : వేమిరెడ్డి దంపతులు*
– సమాజ సేవ కోసమే విపిఆర్ ఫౌండేషన్ స్థాపించాం.
– 2017 లో విపిఆర్ అమృత ధార పేరిట ఉదయగిరి ప్రాంతంలో తొలి ఆర్ ఒ ప్రాంభించాం.
– జిల్లా వ్యాప్తంగా 190 వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రజల దాహార్తి తీరుస్తునాం.
– విపిఆర్ నేత్ర ద్వారా వరికుంటపాడు, ఉదయగిరి మండలాలలో దృష్టి లోపం వున్న 7 వేల మందికి కంటి అద్దాలు ఇచ్చాం.
– విపిఆర్ నేత్ర సెకండ్ ఫేస్ కోవూరు నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తాం.
– నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 11 వందల మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ళు అందచేశాం.
– అనుభవజ్ఞులైన బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి నాయకత్వంలో టిడిపి బలోపేతం అవుతుంది.
– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇళ్ల వద్దకే చేరుస్తామన్న ఎన్నికల నాటి హామి ఆచరణలో అమలు చేస్తున్నాం.
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలలోకి వచ్చామన్నారు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్సి మరియు జిల్లా టిడిపి అధ్యక్షులు బీద రవిచంద్ర గార్లతో కలిసి విడవలూరు మండలం రామతీర్ధం గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆర్ ఒ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపి వేమిరెడ్డి గారికి స్థానిక టిడిపి మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. బాణా సంచా కాలుస్తూ మేళ తాళాలతో ఉరేగింపుగా ఎదిరేగి ఆహ్వానం పలికారు. వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్సి మరియు జిల్లా టిడిపి అధ్యక్షులు బీద రవిచంద్ర గార్లతో కలిసి ఆయన రైతులకు పట్టాదార్ పాస్ బుక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ తన ఎంపి పదవికున్న రెండు అక్షరాలు ఎమ్మెల్యేగా తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పదవికి వున్న మూడు అక్షరాలు కలిపి ఎంపి, ఎమ్మెల్యే అనే అయిదు అక్షరాలు ప్రజాసేవకే అంకితమన్నారు.
సమాజ సేవ కోసమే విపిఆర్ ఫౌండేషన్ స్థాపించామన్నారు. 2017 లో విపిఆర్ అమృత ధార పేరిట ఉదయగిరి ప్రాంతంలో తొలి ఆర్ ఒ ప్రాంభించామని జిల్లా వ్యాప్తంగా 190 వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రజల దాహార్తి తీరుస్తున్నామన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలున్న ప్రత్యేక బస్సు సుశిక్షితులైన కంటి వైద్యుల బృందంతో ఉదయగిరి ప్రాంతంలోని వరికుంటపాడు మండలంలో విపిఆర్ నేత్ర అనే కంటి వైద్యానికి సంబంధించిన ప్రజాహిత కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కంటి సమస్యలు వున్న వారిని డాక్టర్లు పరీక్షించి దృష్టి లోపం ఉంటే అక్కడికక్కడే కంటి అద్దాలు తయారు చేసే వ్యవస్థ బస్సులో ఉందన్నారు. విపిఆర్ నేత్ర ద్వారా వరికుంటపాడు, ఉదయగిరి మండలాలలో గ్రామ గ్రామాలకు వెళ్లి 12 వేలకు పైగా దృష్టి లోపం వున్న వారిని పరీక్షించి 7 వేల మందికి కంటి అద్దాలు ఇచ్చామన్నారు. విపిఆర్ నేత్రకు సంబంధించి మరో బస్సు రెడీ అవుతుందని మరో రెండు నెలల్లో విపిఆర్ నేత్ర సెకండ్ ఫేస్ కోవూరు నియోజకవర్గం లోని రామతీర్ధం నుంచే ప్రారంభిస్తామన్నారు. దివ్యాంగుల విన్నపం మేరకే ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ళ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్టు ఎంపీ వేమిరెడ్డి గారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 11 వందల మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ళు అందచేశామన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు ఉపయోగ పడుతున్నాయన్నారు. అనుభవజ్ఞులైన బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి నాయకత్వంలో టిడిపి బలోపేతం అవుతుంది. నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలుంటే పరిష్కరించుకొని అందరు ఐకమత్యంగా వుండాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సూచించారు.
చంద్రబాబు రైతు బాంధవుడు
అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నిర్వహణ కూడా విపిఆర్ ఫౌండేషనే చూస్తుందనన్నారు. 2017 లో ఉదయగిరిలో ప్రారంభించిన వాటర్ ప్లాంట్ నేటికీ కొనసాగుతుందన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన క్యాన్సర్ స్క్రీనింగ్, ట్రై సైకిళ్ళ పంపిణి తదితర సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఎన్నికల సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇళ్ల వద్దకే చేరుస్తామన్న హామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో అమలు చూపించారన్నారు. గత ఐదేళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్ది సిఎం చంద్రబాబు నాయుడు రాష్టాన్ని అభివృద్ధి పదలోనికి తీసుకుపోతున్నారన్నారు. గతమెన్నడూ లేని విధంగా వరికి గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ధాన్య సేకరణ చేసిన 24 గంటలలో హమాలీ చార్జీలతో రైతుల ఖాతాలలో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతు సోదరులకు అండగా నిలుస్తున్న సిఎం చంద్రబాబు నాయడు గారికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
వేమిరెడ్డి దంపతుల సేవా దృక్పధాన్ని ఎమ్మెల్సీ మరియు టిడిపి అధ్యక్షులు బీదా రవిచంద్ర అభినందించారు. విపిఆర్ ఫౌండేషన్ పేదల పాలిట పెన్నిధిగా ఎమ్మెల్సీ రవిచంద్ర అభివర్ణించారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు ప్రజా ప్రతినిధులుగా ప్రజలతో మమేకమై చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. వేమిరెడ్డి దంపతుల సారధ్యంలో నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం మరియు కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, విడవలూరు టిడిపి అధ్యక్షులు ఏటూరి శ్రీహరి రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, పాశం శ్రీహరి రెడ్డి, ఆవుల వాసు పూండ్ల అచ్యుత్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు టిడిపి యూనిట్, క్లస్టర్ మరియు బూత్ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు.
