* *నెల్లూరు నగర నియోజకవర్గం 3 వ డివిజన్..*
*
*ఉవ్వెత్తున ఉద్యమంలా సాగుతున్న వైస్సార్సీపీ కోటి సంతకాల సేకరణలో కార్యక్రమంలో పాల్గొన్న…ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————–
నెల్లూరు 3 వ డివిజన్ కిసాన్ నగర్ లో వైసిపి డివిజన్ ఇన్ చార్జ్ *అక్కలరెడ్డి నారాయణరెడ్డి* గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొన్నారు.. ఈసందర్బంగా మొదట పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రచ్చబండ..కార్యక్రమం నిర్వహించి.. డివిజన్ స్థాయి కమిటీలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

అనంతరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా *వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు*

*మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి స్థానిక ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ… కోటి సంతకాల సేకరణ పత్రులపై సంతకాలు చేశారు.*

ఈ సందర్భంగా *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..

• *గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏకంగా 17 నూతన మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగిందని అన్నారు.*

• *ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా.. చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను..ప్రైవేటుకు అప్పగించడం దుర్మార్గమని మండిపడ్డారు*

• *మెడికల్ కళాశాలాలను.. తమ పార్టీ నేతలకు అప్పనంగా దోచి పెట్టేందుకే..చంద్రబాబు నాయుడు ఇలాంటి.. అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.*

* *ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి.. పిలుపుమేరకు కోటి సంతకాల ఉద్యమం చేపడుతున్నామని అన్నారు.*

• అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో 3 వ డివిజన్ కిసాన్ నగర్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.

• ఈ ప్రాంతంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నడం చూస్తుంటే.. ఈ సంతకాలు.. నెల్లూరు నగర నియోజకవర్గంలో 60000 కాదు లక్ష దాటే అవకాశం కనిపిస్తుందన్నారు.

• *కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి.. కూటమి ప్రభుత్వానికి ప్రజా ఆకాంక్షను బలంగా తెలియజేస్తామన్నారు.*

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వరరెడ్డి,5,11,డివిజన్ ఇన్ చార్జ్ లు సుబ్బారెడ్డి, మహేష్ యాదవ్, వైసిపి నేతలు రామచంద్రయ్య, హరిబాబు, అభిషేక్ రెడ్డి, ధనుంజయ, మల్లి ఖార్జున, రాజ్ కుమార్, సుజాతమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed