*తేదీ : 28-04-2025*
*నెల్లూరు.*

ఉర్సా వంటి కంపెనీలకు దోచి పెట్టడానికే తప్ప ఉద్యోగులకు, మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మనసు రావడం లేదు. – *ఎంప్లాయిస్ & పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి.*

వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎంప్లాయిస్ & పెన్షనర్ల విభాగం అధ్యక్షులు శ్రీ నలమారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ

🔹 ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల అప్పుడు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదని అన్ని జిల్లాల ఉద్యోగులు మా దృష్టికి తెస్తున్నారు.

🔹 గెలిచిన వెంటనే ఉద్యోగులకు అన్ని బకాయిలు వెంటనే చెల్లిస్తాను అని చెప్పిన చంద్రబాబు గారు సంవత్సరం గా వస్తున్న కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

🔹 ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి, మేనిఫెస్టోలో పొందుపరిచి ఉద్యోగుల ఓట్లు వేపించుకొని గెలిచిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ హామీలతో మాకు సంబంధం లేదనే విధంగా ప్రవర్తిస్తుంది.

🔹 గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎన్జీవో సంఘ అధ్యక్షుడుగా ఉన్న నేను ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గరికి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా అన్నారు కదా ఆ హామీ నెరవేర్చమని అర్జీ ఇవ్వడానికి వెళ్తే నేనెప్పుడూ హామీ ఇచ్చిన విధంగా మాట్లాడారు.

🔹 ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీలు ఇవ్వడం తర్వాత వారు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా వారి పట్టించుకోకపోవడం చంద్రబాబు గారి నైజం.

🔹 2024 లో కూడా అదేవిధంగా గెలిచిన వెంటనే ఉద్యోగులకు మంచి PRC ఇస్తాం, మధ్యంతర భృతి ఇస్తాం అని చెప్పి ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

🔹 ఉద్యోగులందరూ PRC, మద్యంత భృతి ఎప్పుడు ఇస్తారు అని ఎదురుచూస్తున్నారు.

🔹 కొత్త పిఆర్సి కమిషనర్ ఇంతవరకు నియమించడం లేదు.

🔹 కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వాలనుకుంటుందా? ఎగ్గొట్టాలని అనుకుంటుందా నేను ప్రశ్నిస్తున్నాను.

🔹 ఎన్నికల సమయంలో ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు సరిగా ఇవ్వడం లేదని మేము రాగానే ఒకటో తేదీని జీతాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు గారు గడిచిన 11 నెలలలో ఒక్క నెలలో మాత్రమే ఒకటో తేదీ జీతం వేశారు.

🔹 కొంతమంది ఉద్యోగులకు రెండు మూడు తేదీల్లో జీతం పడుతుండగా చాలామందికి 6, 7 తేదీల వరకు జీతం పడడం లేదు. మరికొందరికి ఇంకా లేటుగా పడుతుంది.

🔹 ముఖ్యమంత్రి గారు సభలలో మాత్రం మేము ఒకటో తారీకు జీతాలు ఇస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు.

🔹 ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులు కలిపి దాదాపు 15 లక్షలు ఉంటే ఒక 50,000 మందికి మాత్రమే కరెక్ట్ గా జీతాలు వేస్తూ అందరికీ వేస్తున్నామని చెప్పుకుంటున్నారు.

🔹 రాష్ట్రంలో సిపిఎస్ విధానం కింద ఉన్న సుమారు మూడు లక్షల ఉద్యోగస్తులు ఉన్నారు.

🔹గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిపిఎస్ విధానం స్థానంలో జిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తామని జీవో కూడా జారీ చేస్తే మేము అధికారంలో రాగానే దానిని అవేయన్స్ లో పెట్టి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు చెప్పిన మాటలు విని సిపిఎస్ ఉద్యోగులు అందరూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది.

🔹 ఇప్పుడు వారికి మొండి చేయి చూపడంతో ఎన్నికల్లో ఉపయోగించుకొని మమ్మల్ని మోసం చేశారని బాధపడుతున్నారు.

🔹 ఉద్యోగులకు దాదాపు 30 వేల కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉండగా అవి చెల్లించకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది.

🔹 జనవరిలో 30 కోట్లు, మార్చిలో 6,200 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ అవి ఉద్యోగులకు సరిగా అందడం లేదు. ఏదో ఒక పేరుతో విడుదల చేసిన నిధులలో కూడా కోత పెడుతున్నారు.

🔹 ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి/ పెన్షనర్ కి ఈ బకాయిలన్నీ కలుపుకుంటే దాదాపు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు రావాల్సి ఉంది.

🔹 ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు.

🔹 గత ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి వారి ద్వారా అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు , కరోనా సమయంలో కూడా అనేక పనులు చేపించుకుని దేశం మొత్తం ప్రశంసలు పొందడం జరిగింది.

🔹వారి మీద అనేక నిందలు వేసిన కూటమి నాయకులు ఎన్నికల సమయంలో మీ సేవలకు 5000 కాదు 10000 ఇవ్వాలని కూటమి ప్రభుత్వం రాగానే ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు వారిని పూర్తిగా పక్కన పెట్టేశారు.

🔹 కొంతమంది ఉద్యోగులు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి న్యాయం చేయమని అడిగితే మీకు సంబంధించి ప్రభుత్వంలో ఏ ఫైల్ లేదు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి జీవో కాపీలు చూపించి న్యాయం చేయమని అడిగితే మాయమాటలు చెప్పి తప్పించుకున్నారు తప్ప వారికి న్యాయం చేయకుండా చిరుద్యోగులను రోడ్డు న పడేశారు.

🔹 వాలంటీర్స్ తోపాటు బేవరేజెస్ కార్పొరేషన్ లో పనిచేసిన చిరుద్యోగులు కూడా రోడ్డున పడ్డారు.

🔹 ఆశా వర్కర్ల, అంగన్వాడి టీచర్లు తో పాటు అనేకమంది చిన్నతరహా ఉద్యోగులుకు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ఈరోజు వారిని పట్టించుకోవడం లేదు. వారందరూ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి.

🔹 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీని పట్టించుకోకపోగా ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పించి ఎక్కడ ఇచ్చారు అని అడిగితే ప్రింటింగ్ మిస్టేక్ అని తప్పించుకున్నారు.

🔹 ప్రసంగాల్లో మాత్రం ఏవో కంపెనీలు పెట్టాం ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి అని చెప్తారు. అవి ఎక్కడ ఉంటాయో తెలియదు.

🔹 ఇటీవల ఉర్షా కంపెనీ పేరుతో విశాఖపట్నం నగరంలో సుమారు 60 ఎకరాల భూమిని ఎకరా రూపాయి చొప్పున కేటాయించడం జరిగింది.

🔹 ఆ కంపెనీ ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది ఆ కంపెనీ సామర్థ్యం ఎంత అని ఆలోచించడం ఉండదు.

🔹 అంత విలువైన భూములను ఇటువంటి కంపెనీకి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి. అది ప్రభుత్వ కంపెనీ కాదు, బాగా పేరు ఉన్న కంపెనీ కూడా కాదు.

🔹 ఆ కంపెనీ వల్ల వేళల్లో లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేదు.

🔹 3000 కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి ఇస్తారు గాని ఉద్యోగులకు గాని మీడియా సోదరులకు గాని ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మనసు ఒప్పదు.

🔹 ఉద్యోగులకు ఇప్పటివరకు మూడు DA లు పెండింగ్ ఉండగా ఇప్పటివరకు దాన్ని ఊసే లేదు. క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడల్లా ఉద్యోగులకు DA లు, IR, బకాయిలు ఇస్తారని ఎదురు చూడడమే తప్ప వాటి గురించి ఎటువంటి ప్రకటన లేదు.

🔹 దేశంలో ఎక్కడా లేనివిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామంలోని అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందించే విదంగా ఉద్యోగులను నియమిస్తే ఇప్పటి కూటమి ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో వారిలో కొంతమందిని తొలగించడం జరుగుతుంది.

🔹 ఉద్యోగాన్ని సృష్టించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలని ఏదో ఒక కారణం చెప్పి తగ్గించేయడం లేదా వేరు వేరు శాఖలకు బదిలీ చేయడం జరుగుతుంది.

🔹 ఒక మంచి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారని తిన్న నేను తిన్న ఏకైక కారణంతో నాశనం చేస్తున్నారు.

🔹 ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థలను కొనసాగించాలని చూడకుండా ఈ విధంగా నాశనం చేయడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

🔹 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed