- *ఉరకలెత్తిన ఉత్సాహం.. తరలివచ్చిన పల్లెజనం*
– అనంతసాగరం మండలంలో శంకరనగరంతో ప్రారంభమైన వేమిరెడ్డి, ఆనం ఎన్నికల ప్రచారం
– అభివృద్ధికే ఓటు వేయాలని విజ్ఞప్తి
ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో నెల్లూరు పార్లమెంట్ ఎన్‌డీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారి ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండలంలోని శంకరపాలెం నుంచి తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న నేతలకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పూల వర్షం మధ్య ఘనంగా సత్కరించారు. ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రజల అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ఆనం రామనారాయణ రెడ్డిగారు అనుభవం ఉన్న వ్యక్తి అని, అలాంటి నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతం బాగు పడుతుందన్నారు. మేకపాటి కుటుంబం ఈ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజల జీవితాలను బుగ్గి చేశారని దుయ్యబట్టారు. ప్రజలందరూ గమనించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా ఆనం గారిని, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు.