*ఉపనయనంకు హాజరైన ఆదాల*
ఏపీఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ వంశీధర్ కుమారుడు నిఖిలేశ్వర్ ఉపనయనం కార్యక్రమానికి *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు* హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపనయనం చేసుకుంటున్నా నిఖిలేశ్వర్ ను మాజీ ఎంపీ ఆదాల అక్షింతలు వేసి ఆశీర్వదించారు. సోమవారం నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ లో వంశీధర్ నివాసంలో జరిగిన నిఖిలేశ్వర్ ఉపనయనం కార్యక్రమానికి నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైస్సార్సీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్, యేసునాయుడు, సిహెచ్ హరిబాబు యాదవ్, జెడ్పిటిసి సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, కొండేటి నరసింహా రావు, షేక్ అల్లాబక్షు, మొయినుద్దీన్, షేక్ సంధాని బాషా, బెల్లంకొండ వెంకయ్య, నాని తదితరులు హాజరయ్యారు.