ఈ సంవత్సరపు ఆఖరి లోపు టిడ్కో హౌసెస్ అన్నింటినీ సకల సదుపాయాలతో పూర్తిచేసి లబ్ది దారులకు అందిస్తాం….
*వేములపాటి అజయ్ ,ఏపీ టిడ్కో చైర్మన్*
వెంకటగిరి ఏపీ టిడ్కో హౌసెస్ సందర్శన అనంతరం జరిగిన సమావేశంలో ఏపి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు,వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు అధికారులు జనసేన తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు…
ఈ సందర్బంగా అజయ్ గారు మాట్లాడుతూ…
పేదలకు ఇల్లు ఇవ్వాలనే సదుద్దేశం తో చంద్రబాబు నాయుడు గారు నారాయణ , అప్పటి మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ ప్రభుత్వ స్థలాలను సర్వే చేయించి ఆధునిక పరిజ్ఞానంతో నాలుగు లక్షల పేదలకు ఇళ్ళు నిర్మిస్తే ఎక్కడ వారికి పేరు వస్తుందో అని కక్ష పూరితంగా జగన్మోహన్ రెడ్డి ఇల్లను ఇవ్వలేదు….
ఎవరైతే డబల్ బెడ్ రూమ్ టిడ్కో ఇళ్ళు అప్లై చేసి ప్రభుత్వం తరఫున లోన్ తీసుకొని అడ్వాన్సు డబ్బు కట్టి ఇంకా ఇల్లు ఇవ్వని పేదల ఇళ్ల కు ప్రభుత్వం తరఫున 145 కోట్ల రూపాయలు డిసెంబరు నెలాఖరు దాకా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెల్లించింది.
మిగిలిన హౌసెస్ ను పూర్తిచేసి ఇచ్చేందుకు ₹4,500 కోట్ల రూపాయలు హట్కో కంపెనీ ద్వారా రుణాలు మంజూరు అయినవి.2025 సంవత్సర అంతానికి అందరికీ సకల సదుపాయాలతో గృహాలను గృహాలను పూర్తి చేసి అందిస్తాము.
ఈ సమావేశంలో ఏపి టిడ్కో చైర్మన్ అజయ్ టిడ్కో గృహస్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను చూపారు…
టిడ్కో హౌసెస్ స్మశాన వాటిక
*-* ఎమ్మార్వో తో సర్వే చేయించి 15 రోజుల్లో రిపోర్ట్ ఇద్దాం..
టిడ్కోఇళ్లలో మంచినీరు ఒక పూటు మాత్రమే వస్తుంది *-* ఏఈ గారితో మాట్లాడి రెండు పూటలా వచ్చేటట్లు సత్వరమే చర్యలు.
చెత్తా చెదరం పేర్కొని ఇబ్బంది- జంగిల్ క్లియరెన్స్ తో మున్సిపల్ కార్మికులను అధికారులకు ఆదేశాలు.
పింఛన్లు ఎక్కడికో పోయి తీసుకోవాల్సి వస్తుంది *-* ఎమ్మెల్యే తో ఈ నెల నుంచి టిడ్కో ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు.
రేషన్లు టిడ్కో ఇంటి వద్ద ఏర్పాటు చేయాలి *-* ఇక్కడ ఉండే లబ్ధిదారులకు ఎన్ని షాపులు అవసరమవుతాయో వాటి రిపోర్టు సత్వరమే తెప్పించి అతి త్వరలో ఏర్పాటు చేస్తాం.
కొంతమంది వృద్ధులకు పై ఫ్లోర్లో ఇవ్వడం వల్ల ఎక్కలేకపోతున్నాం *-*
గతంలో హౌసెస్ లాటరీ సిస్టం ద్వారా ఇవ్వబడినవి…ఇప్పుడు అలాట్ అయినా ఇళ్లలో కొన్ని క్యాన్సిల్ అయ్యే అవకాశాలున్నాయి వాటిలో పరిశీలించి ముందు ప్రయారిటీగా వృద్ధులకు వికలాంగులకు ఏర్పాటు.
అసాంఘిక కార్యక్రమాల తో ఇబ్బంది *-* ఎంతమంది ఉన్నారో పరిశీలించి త్వరలో పోలీస్ పికెట్ ఏర్పాటు ఇంత లో హౌస్ పై స్థానికంగా దీనికి హద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్ గోడలపై ఉంచి అసాంఘిక కార్యక్రమాలపై ఫిర్యాదు చేయాల్సిన నెంబర్ ఏర్పాటు .
అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన బాధ్యతని తూచ తప్పకుండా పాటిస్తూ పేదలకు ఇల్లు అందించాలని సత్సంకల్పం తో అహర్నిశలు శ్రమిస్తున్న ఏపిటికో చైర్మన్ వేములపాటి అజయ్ తమ సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా ఇక్కడికి విచ్చేసినందుకు లబ్ధిదారులందరూ హర్షం వ్యక్త పరిచారు..