నెల్లూరు, ఫిబ్రవరి 13 :
*ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరు పర్యటన దృష్ట్యా అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆనంద్*
గురువారం జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, ఎం ఎల్ ఎ ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, కందుకూరు సబ్ కలెక్టర్ టి శ్రీ పూజ, ఇతర శాఖల అధికారులతో కలసి కందుకూరు పట్టణం లో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలైన టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిపాడ్, దూబగుంట మెటీరియల్ రికవరీ ఫెసిలిటి సెంటర్, దూబగుంట గ్రామం, వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణ లను అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లయెజాన్( ASL) నిర్వహించారు.
ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని వివరిస్తూ ఉదయం 11:00 లకు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11:45 కు కందుకూరు లోని టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ప్రజా ప్రతినిధులు, నాయకులు ముఖ్యమంత్రి ని కలుసుకుంటారు. అనంతరం 11:50 కు అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 12:05 కు దూబగుంట శివార్ల లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటి సెంటర్ ను ప్రారంభిస్తారు. అనంతరం 12:20 కు దూబగుంట గ్రామానికి చేరుకుని గ్రామస్తులతొ కలసి పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొని, దూబగుంట కుంట దగ్గర మొక్కలు నాటుతారు. అనంతరం 1:30 నుండి 2:30 వరకు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ప్రజలతొ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 2:45 కు కందుకూరు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 3:25 కు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీ, రవాణా తదితర శాఖల అధికారులందరూ వారికి కేటాయించిన విధులు వారు భాద్యతతొ సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎక్కడా ఎటువంటి లోటు పాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించి ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను జయప్రదం చేయాలన్నారు. తొలుత జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతొ కలసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ ( ASL ) ను నిర్వహించారు.
( జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది )