*ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోండి : ఎంపి వేమిరెడ్డీ*
నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేసేలా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఈఎస్ఐసి డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వేమిరెడ్డి.. ఈ సందర్భంగా హాస్పిటల్ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. స్థల పరిశీలనకు సంబంధించి అంశాలపై మాట్లాడారు. త్వరితగతిన నిర్ణయం తీసుకుని హాస్పిటల్ ఏర్పాటు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.