*ఇస్కాన్ సిటీ టు లేఔట్ ను పరిశీలించిన సిపిఐ నాయకులు*

పొదలకూరు మండలం మరపురు గ్రామ సమీపంలో ఉన్న ఇస్కాన్ సిటీ టు లేఅవుట్ ను సిపిఐ నాయకులు ఈరోజు పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి. లీలామోహన్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు వై ఆదినారాయణ మాట్లాడుతూ

ఇస్కాన్ సిటీ టు లేఅవుట్ కి ఆనుకొని ఉన్న మరుపూరు గ్రామానికి సంబంధించిన రెండు సర్వే నెంబర్లలో గుంట పోరంబోకు మేత పోరంబోకు సంబంధించిన ఎనిమిది ఎకరాల 40 సెంట్లు లేఔట్ యాజమాన్యం ఆక్రమించుకుందని పొదలకూరు ఎమ్మార్వో నే నిర్ధారించినప్పటికీ లేఅవుట్ యాజమాన్యం ఏమాత్రం జంకు బొంకు లేకుండా ప్రభుత్వ స్థలాన్ని విడిపించకుండా 8 ఎకరాల 40 సెంట్లు భూమిని  ఔట్ లో కలిపేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.

దీనిపైన గ్రామస్తులు అనేక మార్లు ఆ యాజమాన్యాన్ని కలిసిన సమాధానం లేదని అన్నారు. గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ని కలవగా ఆయన పొదలకూరు తాసిల్దార్ ని పంపించడం జరిగింది.తాసిల్దారు 8 ఎకరాల 40 సెంట్లు ప్రభుత్వ స్థలమని దీన్ని మీ లేఔట్ నుంచి విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినా  యాజమాన్యం పెడచెవిన పెట్టిందని తెలిపారు.

ఇది మరుపూరు గ్రామంలో ఉన్న మూగజీవాలు మేతమేయడానికి నీరు తాగడానికి ఉపయోగించుకుంటున్న స్థలం అని దాదాపు 60 కోట్ల విలువ చేసే స్థలాన్ని లేఔట్ యాజమాన్యం అక్రమంగా ఆక్రమించడం దాన్ని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మిన్న కొండ పోవడం చూస్తుంటే దీని వెనక ఎంత పెద్ద స్థాయిలో లాబీయింగ్ జరిగిందో అర్థమవుతుందని అన్నారు.

ఆ ప్రభుత్వ స్థలాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయినా రెవెన్యూ అధికారులను పంపించి ఎంక్వయిరీ చేయించి ఆ స్థలాన్ని యాజమాన్యం నుంచి విడిపించి మరుపూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ గా విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు.

లేఅవుట్ యాజమాన్యం ఇప్పటికైనా మంచి మనసుతో ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పి ఆ గ్రామానికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు.

పై కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు చల్లా నరసయ్య చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పముజుల హరి మాజీ సర్పంచ్ దండు శేషయ్య కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రాజగోపాల్ లక్ష్మయ్య కౌలు రైతుల సంఘం సహాయ కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed