ఇస్కపల్లి హైస్కూల్ అభివృద్ధి మా బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలకు రోల్ మోడల్ గా ఇస్కపల్లి హైస్కూల్ ను తీర్చిదిద్దుతాం.* *ప్రయాణ దూరంతో ఏ ఒక్కరూ పాఠశాల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నేడు 422 సైకిళ్లను విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాము.* *ఇస్కపల్లి హైస్కూల్ లో తమ తల్లిదండ్రుల పేరిట మిత్రులు దివ్వెల హరిశ్రీనివాస్ నిర్మించ తలపెట్టిన ఆధునిక వంట గది, భోజనశాలల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన చేశాం.* *విద్యాశాఖను నారా లోకేష్ గారు ఛాలెంజ్ గా స్వీకరించారు. పేద, బడుగు, బలహీన, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారు.* *ప్రభుత్వ, ప్రజా సమన్వయం తో గతంలో ప్రగతి సాధించిన “జన్మభూమి” విధానంకు నారా లోకేష్ మళ్ళీ శ్రీకారం చుట్టడం హర్షణీయం.* *ప్రైవేటు స్కూల్స్ పై మోజు వీడి, అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ధైర్యంగా పిల్లల్ని చేర్చండి.* *ఇస్కపల్లి హైస్కూల్ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేవరకు నేను, బీద మస్తాన్ రావు అండగా ఉంటాం.. గ్రామస్థులకు ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.*

*ఇస్కపల్లి హైస్కూల్ అభివృద్ధి మా బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలకు రోల్ మోడల్ గా ఇస్కపల్లి హైస్కూల్ ను తీర్చిదిద్దుతాం.*

*ప్రయాణ దూరంతో ఏ ఒక్కరూ పాఠశాల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నేడు 422 సైకిళ్లను విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాము.*

*ఇస్కపల్లి హైస్కూల్ లో తమ తల్లిదండ్రుల పేరిట మిత్రులు దివ్వెల హరిశ్రీనివాస్ నిర్మించ తలపెట్టిన ఆధునిక వంట గది, భోజనశాలల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన చేశాం.*

*విద్యాశాఖను నారా లోకేష్ గారు ఛాలెంజ్ గా స్వీకరించారు. పేద, బడుగు, బలహీన, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారు.*

*ప్రభుత్వ, ప్రజా సమన్వయం తో గతంలో ప్రగతి సాధించిన “జన్మభూమి” విధానంకు నారా లోకేష్ మళ్ళీ శ్రీకారం చుట్టడం హర్షణీయం.*

*ప్రైవేటు స్కూల్స్ పై మోజు వీడి, అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ధైర్యంగా పిల్లల్ని చేర్చండి.*

*ఇస్కపల్లి హైస్కూల్ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేవరకు నేను, బీద మస్తాన్ రావు అండగా ఉంటాం.. గ్రామస్థులకు ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.*

JRR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇస్కపల్లి గ్రామ హైస్కూల్ నందు విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం లో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు,HPR అధినేత హరి శ్రీనివాస్ ,పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీద గిరిధర్,డా.లోకనాధం, దేవరాల సుబ్రమణ్యం , స్థానిక సర్పంచ్ ,ఎంపీపీ, హై స్కూల్ సిబ్బంది లతో కలిసి పాల్గొన్న శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర.

*ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ……*

ప్రభుత్వ విద్యాలయాలు అంటే సామాజిక స్పృహ, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా అందించే దేవాలయాలు.

పాఠశాలలను ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసినా, ఉత్తమ ఉపాధ్యాయులు అందించినా…. తల్లిదండ్రులు, గ్రామస్థులు చొరవ తీసుకుని ప్రోత్సహించకపోతే మంచి ఫలితాలు సాధించడం అసాధ్యమే.

ఇస్కపల్లి గ్రామ విద్యార్థులకు ఉత్తమ విద్య, సౌకర్యాలు అందించి చేతులు దులుపుకోము, వారికి ఉద్యోగాలు వచ్చేంతవరకు నేను, బీద మస్తాన్ రావు బాధ్యత తీసుకుంటాం.

ప్రభుత్వం ఎన్ని తరగతి గదులు, ల్యాబ్ లు నిర్మించినా, ఉత్తమ టీచర్లను నియమించినా… గుడిసెల్లో నడిచే ప్రైవేటు విద్యపైనే తల్లిదండ్రులు మోజు చూపుతున్నారు, మంచి చదువు అక్కడే దొరుకుతుందని భ్రమపడుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బిడ్డలపై ప్రేమతో అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు నేటి తల్లిదండ్రులు. ప్రైవేటు పాఠశాలల కన్నా మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందనే విషయం మరచిపోతున్నారు.

1995 సం.లో ఇస్కపల్లి పాఠశాలలో తలెత్తిన టీచర్ల కొరతపై గ్రామస్తులతో చర్చించి, పాఠశాల అవసరంకు మించి అదనంగా ఇద్దరు టీచర్లను తీసుకువచ్చాం. విద్యార్థులయితే పెరిగారు కానీ ఆశించిన ఫలితాలు రాలేదు.

ఇస్కపల్లి హైస్కూల్ అభివృద్ధి కోసం కలెక్టర్ ను కలిశా, నారాయణ విద్యాసంస్థల టీమ్ ను తెచ్చి ఉపాధ్యాయులతో చర్చించా…. ఇక్కడ పాఠశాలను అభివృద్ధి చేయాలని, మార్పు తీసుకురావాలని 1.5 ఏళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.

నారాయణ, శ్రీ చైతన్య, విశ్వసాయి వంటి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నా తల్లిదండ్రుల మోజు మాత్రం వాటిపైనే ఉంది. ఏం మార్పులు తీసుకువస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయో చర్చిస్తున్నాం.

విద్యాశాఖను నారా లోకేష్ గారు ఛాలెంజ్ గా స్వీకరించారు.విద్యాశాఖను సంతృప్తి పరచలేమని, వేరే శాఖను తీసుకోవాలని నారా లోకేష్ గారికి పెద్దలు సూచించినా రాజీ పడలేదు.

విద్యతోనే భవిష్యత్తు ను మార్చగలమని…. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే చిత్తశుద్ధి తోరాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు.

మారుతున్న సమాజం, పిల్లల ఆలోచనలకు అనుగుణంగా తల్లిదండ్రులలో మార్పు రావాలి. పేరెంట్స్ మీటింగ్ లకు హాజరు కావాలి. పిల్లలపై, వారి చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, అంగన్‌వాడీల్లో విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్ గారు ఉన్నారు.

ఇస్కపల్లి హైస్కూల్ భవన నిర్మాణాలలో మార్పుల కోసం జన్మభూమి కాన్సెప్ట్ తో ప్రభుత్వం ముందుకొచ్చింది. 50 శాతం భాగస్వామ్యం అనగా 4 కోట్ల అభివృద్ధి పనుల్లో 2 కోట్లు ప్రభుత్వం, 2 కోట్లు ప్రజా భాగస్వామ్యం ఉండనుంది.

1997 – 2004 వ్యవధిలో అనేక జన్మభూమి కార్యక్రమాలు విజయవంతం చేశాం. అనేక స్కూల్ బిల్డింగ్ లు, అంగన్వాడీలు నిర్మించాం.

50 శాతం ప్రజల భాగస్వామ్యం, 50 శాతం ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసుకునేలా జన్మభూమి పథకంను తిరిగి ఆచరణలోకి తెస్తున్నారు నారా లోకేష్ గారు.

ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల లోపే గ్రామాల్లోని సమస్యలన్నీ తీర్చాలనే కృత నిశ్చయంతో ఉన్నారు నారా లోకేష్ గారు. జన్మభూమి విధానంతో ఒకటిన్నర సంవత్సర కాలంలో ఇస్కపల్లి గ్రామానికి అనేక వసతులు సమకూరాయి.

ప్రజా ప్రతినిధుల సహకారం లేకుండానే గ్రామాల్లో వసతులు సమకూరుస్తున్నాము. మరోవైపు రాజ్యసభ సభ్యులు, సోదరులు బీద మస్తాన్ రావు గారు, మిత్రులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

సొసైటీలు, హరిజనవాడలకు కమిటీ హాల్స్, ఇసుకపల్లి పాలెం, అరుంధతివాడ లకు కమ్యునిటీ హాళ్లు కావాలని కోరారు. ఎవరి అవసరం లేకుండా మంజూరు చేయించుకువస్తాం. దేవాలయాల అనుమతులు ఇప్పటికే మంజూరు చేశాం.

మా సంకల్పానికి మీ గ్రామస్తుల తోడు ఉండాలి. ప్రజల తోడు లేనిదే ఏ ఫలితాలు రావు. కేవలం ఉపాధ్యాయులతోనే కాదు, తల్లిదండ్రుల తోడ్పాటు ఉండాలి.

గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. గ్రామంలోని ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి. ఇక్కడి నుంచే మంచి విద్యార్థులను తయారు చేయాలి. గ్రామ పెద్దలు అందరూ బాధ్యత తీసుకోవాలి.

బిల్డింగులు కట్టినా, ల్యాబ్ నిర్మించినా, సైకిళ్ళు ఇచ్చినా బీఎమ్మార్ ఛారిటబుల్ ట్రస్టు మూడున్నర ఎకరాలు కొని ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసినా….. ఫలితాలు మాత్రం మీరు సహకరించకపోతే రావు.

ఇస్కపల్లి లో దుర్మార్గులు ఉంటారనే ప్రచారం గతంలో ఉండేది. అనేక సంవత్సరాలు కష్టపడిన తరువాత మార్పులు చేసుకున్నాం. ఉత్తమవిద్యకు కేంద్ర బిందువు ఇస్కపల్లి అని చెప్పుకునేలా పాఠశాలను తీర్చిదిద్దుకోవాలి.

విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండించడం సహజం. తమ కుమారుడిని దండించారని ఉపాధ్యాయులతో విద్యార్థి తల్లిదండ్రులు ఘర్షణకు దిగడం మంచి పద్దతి కాదు. దయచేసి వారిని ఇబ్బంది పెట్టకండి.

నేటి పరిస్థితుల్లో మన జడ్పీ హైస్కూల్స్, రామకృష్ణ విద్యా సంస్థలు నూరు సంవత్సరాల పండుగ కు దగ్గరవడం శుభ పరిణామం. 2028 ఏప్రిల్ లో నిర్వహించే ఈ పండుగ ముందే మన ప్రాంతంలోని విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకోవాలి.

అభివృద్ధి పనులను తొలుత ఇస్కపల్లి లో మొదలుపెట్టాం. ఆ తర్వాత చండ్రాయునిపాలెంలోని హైస్కూల్ ను కూడా దశలవారీగా అభివృద్ధి చేసుకుందాం.

ప్రభుత్వంతో పాటుగా బీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం. గ్రామ గ్రామానికి వచ్చి మీ అందరితో మాట్లాడి మీ అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకుంటాం.

కుట్టు సెంటర్లు పెట్టాలా? లేక ఇతర శిక్షణా కేంద్రాలను ఏర్పాట్లు చేయాలా అన్నది మీతో చర్చించి….మీ అందరితో మాట్లాడాకే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed