ఇసుక రీచ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి
– కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ఇసుక రీచ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ బుధవారం స్థానిక బోడి గాడి తోట, సుభాన్ నగర్, దీన్ దయాళ్ నగర్, పొర్లుకట్ట, దొర తోపు, వెంకటేశ్వరపురం, టిడ్కో గృహ సముదాయాల ప్రాంగణం తదితర ప్రాంతాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో రీచ్ ల నుంచి ఇసుక రవాణా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
స్థానిక హరనాధపురం లోని కాలువపై ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా ఎవరికి వారే తొలగించుకోవాలని సూచించారు.
బి.వి.ఎస్ బాలికల పాఠశాలలో షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంను, వాలీబాల్ కోర్టు నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు.
అనంతరం స్థానిక తడికల బజారు కూడలిలోని అన్న క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న అల్పాహారం నాణ్యతను తనిఖీ చేశారు. ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని క్యాంటీన్ నిర్వహకులకు కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఈ.ఈ. రహంతు జానీ, డి.ఈ. ఈ.లు రఘురాం, ప్రసాద్,పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ