
“ఇరుకళల పరమేశ్వరి దేవి ఆలయం నుంచి పోట్టే పాలెం వైపు వెళ్లే మార్గంలో పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షించిన నెల్లూరు నగర కమీషనర్ వై.ఓ. నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఇరుకళల పరమేశ్వరి దేవి ఆలయం నుంచి పోట్టే పాలెం వైపు వెళ్లే మార్గంలో శుక్రవారం పర్యటించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు రోడ్లపై చేరకుండా అవసరమైన పూడికతీత పనులను అన్ని ప్రాంతాలలో చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షపు నీరు ఖాళీ స్థలాలలో నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, జెసిబి యంత్రాల సహాయంతో నీటిపారుదలకు అవసరమైన కాలువలను తవ్వాలని ఇబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు