*ఇది ప్రజల ఆకాంక్షల బడ్జెట్*
*- కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ అద్బుతంగా ఉంది*
*- అభివృద్ధి, సంక్షేమంతోపాటు హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యత : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన 2025-26 పూర్తిస్థాయి బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర పునఃనిర్మాణం దిశగా రూ.3.22 లక్షల కోట్లతో అభివృద్ధి,సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు భారీ కేటాయింపులు చేయడం సంతోషదగ్గ విషయమన్నారు. వ్యవసాయశాఖ బడ్జెట్ రూ.48,340 కోట్లు కేటాయించడం ద్వారా ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించిందన్నారు. వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన నెల్లూరు జిల్లాలో లక్షలాదిమంది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చేలా జలవనరుల శాఖకు రూ.18,020 కోట్లు అధిక కేటాయింపులు చేయడం హర్షించదగ్గ విషయమని ప్రస్తావించారు. బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో 23,260 కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి బాటలు వేశారని, ఆరోగ్యశాఖకు రూ.19,265 కోట్లు, పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు, పురపాలన శాఖకు బడ్జెట్లో రూ.13,862 కోట్లతో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందని కొనియాడారు.