*ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలి*
– ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాకాలు మరియు అవసర సమాచారం అందివ్వండి.
– రైతులు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు వీలుగా మెగా మార్కెట్ యార్డ్ చేయండి.
– నెల్లూరు జిల్లా తీర ప్రాంత మత్స్యాకారుల కోసం మిని జెట్టీల నిర్మాణం చేపట్టండి.
– శాసనసభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకు ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న లక్ష్యాన్ని సాధించడంలో Micro, Small, and Medium Enterprises (MSME) మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో ఎంఎస్‌ఎంఈల స్థాపనలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో కిసాన్ సెజ్, ఏపీఐఐసీ భూములతో పాటు కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు అందుబాటులో వున్నాయన్నారు. ప్రభుత్వ చొరవ చూపి ఎంఎస్‌ఎంఇ కింద ప్రోత్సాహకాలు అందిస్తే స్థానికంగా పరిశ్రమలు స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందికై MSME ల స్థాపనకు సంబంధించి ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ఓరియంటేషన్ శిక్షణ అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అటు రాయలసీమ జిల్లాలు మొదలు యిటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల వరకు రైతులు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకునేందుకై మెగా అగ్రికల్చర్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ప్రస్తావించారు. నెల్లూరు జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో యిసుక మేట కారణంగా మత్స్యకారులు సముద్రంలోనికి పడవలు తీసుకెళ్లేందుకు అవస్థలు పడుతున్నారని తీరప్రాంతమంతా డెడ్జింగ్ చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కోవూరు నియోజకవర్గ పరిధిలోని సముద్రతీర ప్రాంతంలో మిని జెట్టీల నిర్మాణం చేపట్టి మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ప్రశ్నకు MSME మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానమిస్తూ ప్రతి జిల్లాలలో ముగ్గురు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ ను నియమించి MSME స్థాపన పట్ల ఆసక్తి చూపే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ పాలసీలు సంబంధించి అవసరమైన సమాచారం అందిస్తామన్నారు.