
*ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించిన : నగర కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక నారాయణ హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో మంగళవారం పర్యటించారు.
డివిజన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు నిరంతరం పర్యవేక్షిస్తూ, బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేయకుండా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు