ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, 100% లక్ష్యాలను సాధించాలని కమిషనర్ సూర్య తేజ రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు ప్రతిరోజు ఉదయం నుంచి సచివాలయం పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పన్ను బకాయిలు ఉన్న ప్రతి ఒక్క ఆస్తి యజమానికి నోటీసులు జారీ చేసి నిర్దేశించిన సమయంలోపు చెల్లించని పక్షంలో తాగునీటి కుళాయి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరికలు తెలియజేయాలన్నారు. అందుబాటులో లేని భవన యజమానులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. నగరములో అభివృధ్ధి పనులకు గాను ప్రతి అడ్మిన్ కార్యదర్శి వారికి సంబంధించిన సచివాలయ పరిధిలోని నిర్దేశించిన ఆస్తి పన్నులు వసూలు చేసిన యెడల నగరము ఎంతో అభివృధ్ధి చెందుతుంది.
సచివాలయాలు వార్డు ప్రజలకు అర్ధమయ్యే విధముగా సచివాలయ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతి పరిపాలన కార్యదర్శులకు కమిషనర్ సూచించారు. ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్న సచివాలయాలను ఆయా వార్డు ప్రజలకు సౌకర్యం కొరకు వార్డు పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నచో బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు లోకనాథం, శ్రావణ్, శరత్, వంశీ నాథ్ రెడ్డి, సందీప్, కార్తీక్ రెడ్డి, ఏ 1 గుమస్తా కృష్ణ కిషోర్, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.