*ఆర్ పి ఐ పార్టీలో భారీ చేరికలు..*

*కమ్యూనిస్టు పార్టీ నుంచి ఆర్ పి ఐ పార్టీలో చేరిన వాటం భేటీ నాగేంద్ర వారి బృందం..*.

కమ్యూనిస్టు పార్టీకి చెందిన వాటం భేటీ నాగేంద్ర స్థానిక గాంధీ బొమ్మ ఆర్ పి ఐ పార్టీ జిల్లా కార్యాలయం నందు సీనియర్ నాయకుడు పి ప్రకాష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎస్ కె మాభు గారి సమక్షంలో అర్ పి ఐ పార్టీలో చేరారు

అనంతరం ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్ కె మాబు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన ఆర్ పి ఐ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు.

బహుజనులు దళితులు ముస్లింలు ఆదివాసులకు ఇతర రాజకీయ పార్టీలలో చిన్నచూపు చూడడం అవమానించడం నామినేటెడ్ పదవుల నుంచి దించేవేయడా న్ని చూసి ఆవేదన చెందిన బహుజన యువత మా పార్టీలో చేరుతున్నారని అన్నారు

ఇతర రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను కాదని ఇతర రాజకీయ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఎన్నుకున్నారన్నారు నెల్లూరు జిల్లా మరియు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్ పి ఐ పార్టీ సత్తా చాటుతుందన్నారు.

వాటం భేటీ నాగేంద్ర మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ రాజ్యాంగ విలువలతో నడిచే ఏకైక పార్టీ అని తెలిసి ఈ పార్టీలో చేరానన్నారు.

ఆర్ పి ఐ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు సాధన కోసం కష్టపడి నేను నా యొక్క బృందం నిరంతరం పనిచేస్తామని తెలియజేశారు.

నాతోపాటు నడిచే నవీన్. రమేష్. గంగాధర్. యశ్వంత్. సమీర్. శరత్. రవీంద్ర. సమద్. రాజ. చింటూ. కమల్. వెంకటేశ్వర్లు. కే శ్రీను. మహిమలూరు శ్రీను. సయ్యద్ సమద్. ధారా రమేష్. సుబ్రహ్మణ్యం. సంపత్. వలి. గణేష్. వీరందరిని పార్టీ కండువాలతో పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు చిట్టేటి శ్రీనివాసులు కొప్పోలు ప్రమీల బత్తల మధుసూదన్ ఉప్పులూరు మాలకొండయ్య వల్లం నాగ సందీప్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed