*ఆర్ పి ఐ పార్టీకి మిరియాల వెంకటరమణయ్యకి ఎటువంటి సంబంధం లేదు….. పార్టీ పేరు మంత్రి గారి పేరు చెప్పి లోన్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకి పాల్పడితే ఎవ్వరిని వదలము : రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోవూరు సురేష్.*
పార్టీ పేరు మంత్రిగారు పేరు చెప్పి లోన్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకి పాల్పడుతున్నారని స్థానిక గాంధీ బొమ్మ ఆర్పిఐ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఈరోజు మూడు గంటలకు పాత్రికుల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆర్పిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోవూరు సురేష్ మాట్లాడుతూ మిరియాల వెంకటరమణయ్య ఇటీవలే లోన్లు ఉద్యోగాలు ఇప్పిస్తానని పలు మోసాలు చీటింగ్ కేసుల్లో జైలుకు వెళ్లాడని అన్నారు
అతనిని మా పార్టీ నుంచి గతంలోఎప్పుడో బహిష్కరించామని అతను మా పార్టీ పేరు చెప్పి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు చూపించి మంత్రిగారు ఫోటోలు చూపించి లోన్లు ఉద్యోగాలు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లు ఇస్తానని ఇతర దేశాల నుంచి ఫారెన్ ఫండ్ క్రిస్టియన్ సంస్థల అకౌంట్లో డబ్బులు వేయిస్తానని చాలామంది దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకి చేస్తూ పోలీస్ వారెంట్ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వెంకటరమణయ్యను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించి నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు
ఆర్ పి ఐ పార్టీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ అని మహనీయుడు పెట్టిన పార్టీ పేరు చెప్పి లోన్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకి పాల్పడితే ఎంతటి వారినైనా చట్టపరంగా శిక్షించేంతవరకు వదలమని హెచ్చరించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాత్రికేయులకు మీడియా మిత్రులు విన్నపం ఆర్ పి ఐ పార్టీ పేరు చెప్పి చాలామంది ఫేక్ లీడర్లు ఉన్నారన్నారు అటువంటి వారిని గమనించాలని వేడుకున్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ నంబూరు గణేష్ ఆరికొండ సురేష్ డొక్కా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు