*ఆర్ధిక ప్యాకేజీతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం : నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

– స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11వేల 440 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు.
– చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి ఫలించింది.
– ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మాటే ఉండదు.
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11వేల 440 కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియ చేశారు. విశాఖ ఉక్కుకు కేంద్రం ఆర్ధిక ప్యాకేజి సాధించిన నేపథ్యంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ అభివృద్ధికి ఎంతో కీలకమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్రం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజ్‌తో తిరిగి పుంజుకొని పూర్వ వైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ యాజమాన్యం మరియు కార్మికుల సమిష్టి కృషితో నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టాలని ఆయన ఆకాంక్షించారు. కొన ఊపిరిలో వున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఊపిరి పోసేలా 11వేల 440 కోట్ల రివైవల్ ప్యాకేజీ సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల కృషిని ఎంపి వేమిరెడ్డి ప్రశంసించారు. గత ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రయివేట్ పరం చేయాలని ప్రయత్నిస్తే విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేసిందన్నారు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *