ఆరోగ్యశ్రీలో రోగి రిపోర్టులు చూపించక పోతే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీజేపి జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్
నెల్లూరు: ఆరోగ్యశ్రీ పధకంలో ఆపరేషన్ చేయించుకున్న రోగులకు, వారి వైద్య రిపోర్టులను చూసే హక్కు ఉన్నదని బీజేపి జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ హక్కును విస్మరించి, రోగుల చేతికి వారి రికార్డులు ఇవ్వడం లేదని , కనీసం చూసేదానికి కూడా నిరాకరిస్తున్నారనీ,ఆరోపించారు.
అలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వం కఠినంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. “వైద్య సేవలలో పారదర్శకత అవసరం. రోగి తన ఆరోగ్య వివరాలను తెలుసుకునే హక్కును నిరాకరించడం అనేది ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన” అని పేర్కొన్నారు.
అసలు ఆరోగ్యశ్రీ వంటి ప్రజా పధకాల ఉద్దేశం, సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించడమేనని, దీన్ని ఆసుపత్రులు లాభాపేక్షతో అనుసరించడం మానవతా విలువలకు విరుద్ధమని ప్రవీణ్ కుమార్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఆసుపత్రుల్లో ఇలాంటి అక్రమాలు జరగాకుండా ఉండేలా, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.