*” ఆపితే.. ఆగేది కాదు… సర్వేపల్లి ప్రజలలో నాన్న పై ఉన్న అభిమానం” -శ్రీమతి కాకాణి పూజిత*
*తేది:05-06-2025*
*SPS నెల్లూరు జిల్లా:*
*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె శ్రీమతి కాకాణి పూజితమ్మ.*
*కాకాణి పూజితమ్మ మీడియాతో మాట్లాడుతూ..*
👉 వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి, వాడ వాడల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, వారి నిరసనను తెలిపారు.
👉 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు.
👉 కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది.
👉 అరకొరగా పథకాలు అందిస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారు.
👉కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు.
👉 జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు శాంతిభద్రతలు ఎక్కడా క్షీణించకుండా సుపరిపాలనను అందించారు.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజలతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమమే వెన్నుపోటు దినం.
👉ప్రభుత్వం, అధికారులు ప్రజల సంక్షేమం కోసం పనిచెయ్యాలి.
👉 అధికారులు పరిధి దాటి ప్రజలపై నియంతలా ప్రవర్తిస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం.
👉 కూటమి ప్రభుత్వం ప్రజలపై ఒక నియంతలా వ్యవహరిస్తుంది.
👉 శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు.
👉 నాయకులు, ప్రజల సమస్యల గురించి మాట్లాడకూడదు అనే విధంగా వీరి వ్యవహారం ఉంది.
👉 ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలు అంతే ఉత్సాహంతో, నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
👉 ప్రజల కోసం పోరాడే వారికి ప్రజలు అండగా నిలుస్తారన్నమాట నిన్న వేలాది మందితో జరిగిన నిరసన కార్యక్రమం ఒక ఉదాహరణ.
👉 అధికారులు మీడియాను కూడా అడ్డుకున్న పరిస్థితిని చూశాం.
👉 కూటమి ప్రభుత్వంలో పత్రికలకు కూడా స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితులు లేవా!
👉 ప్రజలను, ప్రజల కోసం పోరాడే నాయకులను ఆపేందుకు ప్రయత్నించారు చివరకు, మీడియా గొంతును కూడా నొక్కాలని చూశారు.
👉 అధికారులు ప్రజల కోసం పనిచేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
👉 అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రథమం.
👉 తమ నిరసనను తెలియజేయడానికి వచ్చిన ప్రజలపై, అధికారులు విరుచుకుపడటం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుంది.
👉 ఇటువంటి చర్యలకు దేవుడు రేపటి రోజున ప్రతిదానికి సమాధానం ఇస్తాడు.
👉 నాన్న గారిని జైల్లో పెట్టినా, కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేసినా, కేసులు పెడతామని భయపెట్టినా, వాటన్నింటిని దాటి నిరసన కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయడం సంతోషాన్ని కలిగించింది.
👉 అరెస్టులతో కేసులతో నాన్నపై సర్వేపల్లి ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపలేరు.
👉 నిరసన కార్యక్రమంలో అధికారులు మమ్మల్ని అడుగడుగున అడ్డుకున్నా, మాకు రక్షణగా సర్వేపల్లి ప్రజలు నిలబడ్డారు.
👉 కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాకు నాయకుడు మాత్రమే కాదు మార్గదర్శి కూడా..
👉 కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె కార్యక్రమం చేపట్టలేదని అవహేళనతో అడ్డంకులు సృష్టించినా వారందరికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడం చెంపపెట్టు..
👉 మేము కార్యక్రమం చేయగలమనే నమ్మకంతో కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు మిథున్ రెడ్డి గారికి, గురుమూర్తి గారికి ధన్యవాదాలు.
👉 మా కుటుంబానికి మెండుగా సర్వేపల్లి ప్రజల అభిమానం, ప్రేమ ఉందని గమనించాలి.
👉 ప్రజలు చేసిన ఈ నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి కనువిప్పు కావాలి.
👉 ప్రభుత్వ పెద్దలు ఇకనైనా ఇటువంటి చర్యలకు స్వస్తి పలికి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కోరుతున్నాం.
👉 ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, లెక్కచేయకుండా, మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటాం.
👉 వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సర్వేపల్లి ప్రజలకు పేరుపేరున ధన్యవాదాలు