*ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో*
*.. హుందా రాజకీయాలకు మారుపేరు పర్వత రెడ్డి*
*నారాయణ దగ్గర మార్కులు కోసమా .. నీ తాపత్రయం*
*.. ఆనం వెంకటరమణారెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఊటుకూరు నాగార్జున*
*రాజకీయాల్లో సభ్యత మరిచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న టిడిపి నేత ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ధ్వజమెత్తారు.నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశాల్లో అసభ్య పదజాలాలను వాడుతూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు.*
*2019 ముందు రెడ్ క్రాస్ ఎన్నికలకు ముందు కేవలం ఇంజక్షన్లు వేసే విధంగా ఉండేదని ఇప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. నువ్వు ఒక బచ్చా అని మేము కూడా అనగలమని కానీ రాజకీయాల్లో విలువలు మరింత దిగజారకూడదని వదిలేస్తున్నామన్నారు. 2019 ఎన్నికల సమయంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణ ఓడిపోయి ఐదేళ్లు అంతు పంతులు లేకుండా పోయాడన్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లో నారాయణ అనుచరులు అక్రమ కట్టడాలు చేస్తున్నారని దీనిపై టిడిపి నేత ఆనం వెంకటరమణారెడ్డి స్వయంగా కార్పొరేషన్ అధికారులకు నోటీసులు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తున్నాడంతో ఆనం వెంకటరమణారెడ్డి నేడు నోరు మూసుకున్నారన్నారు. రాజకీయ కమిడియన్ గా ఆనం వెంకటరమణారెడ్డి నిలిచిపోయారని వ్యంగంగా వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించి మూడు జిల్లాల ఎమ్మెల్సీగా గెలుపొందిన పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పై విమర్శలు మానుకోకుంటే అదే స్థాయిలో తమ విమర్శలు ఉంటాయని హెచ్చరించారు.*