*ఆధునిక భారత అభివృద్ధి ప్రదాత అటల్ బీహార్ వాజ్ పేయి* – జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తుంటే వాజ్ పేయి గుర్తుకొస్తారు. – వాజ్‌పేయి గారి జయంతిని దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం శుభపరిణామం. – 11 సార్లు ఎంపిగా 3 సార్లు ప్రధానిగా సేవలందించిన భారతదేశం గర్వించతగ్గ నాయకులు – 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో వాజ్‌పేయి గారు ప్రతిపక్ష నేతగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారు. – వాజ్ పేయిని ప్రధానమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో నాడు చంద్రబాబు నాయుడు ఎన్డిఎ ఛైర్మన్ హోదాలో జాతీయ స్థాయిలో ప్రతి పక్షాలను ఏకం చేశారు. – సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడి కాంబినేషన్లో రాష్టంలో అభివృద్ధి, సంక్షేమం సమ పాళ్ళలో అమలవుతున్నాయి. – నెల్లూరులో మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పేయి విగ్రహావిష్కరణ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు

Byjanahushaar.com

Dec 15, 2025

*ఆధునిక భారత అభివృద్ధి ప్రదాత అటల్ బీహార్ వాజ్ పేయి*

– జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తుంటే వాజ్ పేయి గుర్తుకొస్తారు.
– వాజ్‌పేయి గారి జయంతిని దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం శుభపరిణామం.
– 11 సార్లు ఎంపిగా 3 సార్లు ప్రధానిగా సేవలందించిన భారతదేశం గర్వించతగ్గ నాయకులు
– 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో వాజ్‌పేయి గారు ప్రతిపక్ష నేతగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారు.
– వాజ్ పేయిని ప్రధానమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో నాడు చంద్రబాబు నాయుడు ఎన్డిఎ ఛైర్మన్ హోదాలో జాతీయ స్థాయిలో ప్రతి పక్షాలను ఏకం చేశారు.
– సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడి కాంబినేషన్లో రాష్టంలో అభివృద్ధి, సంక్షేమం సమ పాళ్ళలో అమలవుతున్నాయి.
– నెల్లూరులో మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పేయి విగ్రహావిష్కరణ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు

మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ ​అటల్ బిహారీ వాజ్‌పేయి గారు మరియు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి గారు.భారత రాజకీయాలలో సుపరిపాలనకు, అభివృద్ధికి చిరునామాలుగా నిలిచిన మహా నాయకులన్నారు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో కలిసి ఆయన అటల్-మోడి సుపరిపాలన బస్సు యాత్ర పాటు నెల్లూరు నగరం ముత్తుకూరు బస్ స్టాండ్ వద్ద జరిగిన అటల్ బిహారి వాజ్ పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడుతూ 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో వాజ్‌పేయి గారు ప్రతిపక్ష నేతగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి శత జయంతిని దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం శుభపరిణామం అన్నారు.

అప్పట్లో ప్రధానిగా వాజ్ పేయి గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ ను తలపిస్తూ నేడు నరేంద్ర మోడి, చంద్రబాబు గార్ల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో దూసుకెళ్తుందన్నారు. 18 ఏళ్ళ వయసులో క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా రాజకీయాల్లోనికి వచ్చిన వాజ్ పేయి గారు 11 సార్లు ఎంపిగా 3 సార్లు ప్రధానిగా దేశానికి సేవలు అందించారన్నారు. ప్రతిష్టాత్మక స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ద్వారా దేశంలోని మహా నగరాలైన ఢిల్లీ. కోల్ కత్తా. చెన్నై మరియు ముంబాయి నగరాలకు రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేసిన ఘనత వాజ్ పేయి గారిదేనన్నారు. వాజ్ పేయి గారు నిరాబండరత మారు పేరని ప్రధాని హోదాలో వుంటూ అప్పట్లో ఎన్డీఏ ఛైర్మెన్ గా సలహాలు. సంప్రదింపులు చేసేవారని చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పే మాటలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ పరిపాలన దక్షతకు మారుపేరైన మహానాయకులు మాజీ అటల్ బిహారి వాజ్ పేయి, ప్రధాని నరేంద్ర మోడి గార్ల పేరిట తలపెట్టిన అటల్-మోడి సుపరిపాలన బస్సు యాత్రలో చాలా సంతోషంగా వుందన్నారు. భారతరత్న మాజీ ప్రధాని వాజ్ పేయి గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతో నాడు చంద్రబాబు నాయుడు ఎన్డిఎ ఛైర్మన్ హోదాలో జాతీయ స్థాయిలో ప్రతి పక్షాలను ఏకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. స్వర్గీయ ​అటల్ బిహారీ వాజ్‌పేయి గారి ఆదర్శాలను నేటి తరానికి తెలియజేయడంతో పాటు రాష్టంలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఐక్యతకు “అటల్-మోడి సుపరిపాలన బస్సు యాత్ర” దోహదపడుతుందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి స్పూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు దేశ వ్యాప్తంగా పేదలకు పక్కా ఇళ్ళు కట్టించే ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన ఆరోగ్య రంగానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్, రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారి నాయకత్వంలో భారతదేశం “వికసిత భారత్” లక్ష్యం దిశగా అడుగులు వేస్తుందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి శత జయంతిని పురస్కరించుకుని కూటమి పార్టీ నాయకులు “అటల్-మోడి సుపరిపాలన బస్సు యాత్ర”లో పాల్గొని మహానాయకులైన స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి గారికి ఘన నివాళులు అర్పించ వలసిందిగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బిజెపి రాష్ట అధ్యక్షులు మాధవ్, జిల్లాకు చెందిన ఎంపి, ఎమ్మెల్యేలు,జిల్లాకు చెంది బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed