*ఆదాల హిమబిందు, కొండ్రెడ్డి భరత్ కుమార్ తదితరుల సమక్షంలో వైసీపీలో పలువురి చేరిక*
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దత్తుగా పలువురు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నరసింహారెడ్డి, అనిత తదితరులు వారి మిత్రబృందం సభ్యులతో కలిసి స్వచ్ఛందంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంపూర్ణ మద్దత్తు తెలిపి ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో ఆదాల హిమబిందు, కొండ్రెడ్డి భరత్ కుమార్ తదితరుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. స్వచ్ఛందంగా వైసీపీలో చేరిన వారిని మనస్పూర్తిగా అభినందించి సాదరంగా పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆదాల హిమబిందు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి లంక రామ శివారెడ్డి, నగర పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి, కల్లూరు లక్ష్మీరెడ్డి, పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.