*ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఘన సన్మానం*
*ఆదాలను కలిసిన నెల్లూరు రూరల్ వైస్సార్సీపీ నాయకులు*
*ఆదాలకు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆనం ఆధ్వర్యంలో సత్కారం*
*ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపిన ఆదాల*
*నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలికలు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని* జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ప్రతినిధులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా పదవులు పొందిన ప్రతినిధులు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డిగారి ఆధ్వర్యంలో దుశాలువాలతో సత్కరించి, పుష్పగిచ్చాలు అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆదాల క్యాంపు కార్యాలయంకు జిల్లా, రూరల్ వైఎస్సార్సీపీ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ పదవులు పొందిన నూతన అధ్యక్షులకు, ఇతర పార్టీ ప్రతినిధులకు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డిగారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.