*ఆదాలను కలిసిన జిల్లా యూత్ వైసీపీ నూతన అధ్యక్షులు నాగార్జున్*
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని గురువారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నూతన అధ్యక్షులుగా నియమితులైన కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా యూత్ విభాగం అధ్యక్షులుగా నియమితులైన ఊటుకూరు నాగార్జున్ ను మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ అధ్యక్షులుగా నియమితులైన కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున్ మాజీ ఎంపీ ఆదాలకు పుష్పగుచ్చం అందించి దుశాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డిగారిని దుశాలువాతో జిల్లా యూత్ అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున్ సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశం శ్రీనివాస్, మహిళా నాయకురాలు మల్లి నిర్మల పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.