*ఆదాలకు సిపిఐ(ఎం)27వ రాష్ట్ర మహాసభలకు ఆహ్వానం*
నెల్లూరు నగరంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల 1, 2, 3వ తేదీల్లో జరగనున్న సిపిఐ(ఎం) 27వ రాష్ట్ర మహాసభలకు హాజరుకావాలని *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారికి* జిల్లా సిపిఐ(ఎం) కార్యదర్శి మూలం రమేష్ ఆధ్వర్యంలో జిల్లా సిపిఐ(ఎం) నాయకులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ మేరకు ఆదివారం ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని కలిసి తమ పార్టీ 27వ మహాసభలకు హాజరుకావాలని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ నాయకులు స్వయంగా ఆహ్వానపత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సిపిఐ(ఎం) కార్యదర్శి చండ్రా రాజగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, కే అజయ్ కుమార్, సీనియర్ నాయకులు పి చంద్రారెడ్డి, ప్రజాసంఘాల నాయకులు పులిగండ్ల శ్రీరాములు తదితరులు ఉన్నారు.y