*ఆత్మీయులకు ఆదాల ఆత్మీయ పలకరింపు*
తనను నమ్మిన కార్యకర్తలు, అభిమానుల యోగక్షేమాలు తెలుసుకొని ఆత్మీయగా పలకరించి అండగా నిలవడం *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారి* నైజం. ఈ నేపథ్యంలో సోమవారం 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు షేక్ సలీం, స్థానిక వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలను మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కలుసుకొని ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా పేరుపేరున ప్రతి ఒక్కరిని పలకరించి, అందరికీ అండగా ఉంటాను ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఆదాల సూచించారు. తమను ఆత్మీయంగా పలకరించేందుకు విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైస్సార్సీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్, యేసునాయుడు, సిహెచ్ హరిబాబు యాదవ్, జెడ్పిటిసి సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి , కొండేటి నరసింహారావు, షేక్ అల్లాబక్షు, షేక్ సంధానిబాషా, బెల్లంకొండ వెంకయ్య, నాని తదితరులు ఉన్నారు.