ఆటో డ్రైవర్ల సుస్థిర ఆదాయ కల్పనే లక్ష్యంగా సబ్సిడితో ఆటోలు – నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..

– తెలుగునాడు ఆటో వర్కర్స్ యూనియన్ క్రమశిక్షణకు మారుపేరు..

– వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోండి..

– పోలీసుల నుంచి, రవాణాశాఖాధికారుల నుంచి ఏవైనా ఇబ్బందులుంటే నాకు తెలియజెయ్యండి..

– టీఎన్ టీయూసీ యూనియన్ డ్రైవర్లకు ఐడీకార్డులు అందజేసిన కోటంరెడ్డి.. కోటంరెడ్డికి ఘన సన్మానం..

గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పూటగడవడమే కష్టంగా ఉండేదని.. పోలీసులు, రవాణాశాఖాధికారులు కేసులు రాసి వేధించేవారని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకున్నామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు.. ట్రాపిక్ రూల్స్ కు విరుద్దంగా ఎవ్వరూ ప్రవర్తించొద్దని.. అన్ని పత్రాలను వాహనంలోనే ఉంచుకోవాలని ఆయన సూచించారు.. తెలుగునాడు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సంరద్బంగా వారికి కోటంరెడ్డి ఐడీకార్డులు అందజేశారు.. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగునాడు ఆటో వర్కర్స్ యూనియర్ క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు.. వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.. దళిత ఆటోడ్రైవర్ల సుస్థిర ఆధాయ కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు సబ్సిడి రూపంలో రాష్టంలోని ఆటో డ్రైవర్లకు 4074 ఆటోలను అందజేస్తున్నట్లు తెలిపారు.. ముప్పై వేలు డౌన్ పేమెంట్ కడితే.. మూడు లక్షల రూపాయల విలువైన ఆటోను ఇంటికి తెచ్చుకోవచ్చన్నారు..టీడీపీ నేత కువ్వారపు బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోటంరెడ్డిని యూనియన్ నేతలు ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో కువ్వారపు బాలాజీ, నాగేంద్ర నగర అద్యక్షులు చప్పిడి వెంగయ్య, నగర కార్యదర్శి ప్రసన్న కుమార్, నగర కోశాధికారి అన్నం చంద్రశేఖర్,
మునుస్వామి, శ్యామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *