ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమల వరదకు సిద్ధంగా ఉంది.

కూటమి ప్రభుత్వం బంగారు అవకాశాలు తీసుకొచ్చింది.

సీఐఐ సమ్మిట్ తో ఏపీలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు.

– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు.

విశాఖపట్నం లో నిర్వహించిన సీఐఐ సమ్మిట్ తో రాష్ట్రానికి అపూర్వమైన స్పందన లభించిందని, ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమల వరదకు సిద్ధంగా ఉందని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడిదారుల తొలి గమ్యస్థానంగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తాజా సిఐఐ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయని తెలిపారు. సమ్మిట్ లో మొత్తం 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయని, దేశ విదేశాల నుంచి 113 ప్రముఖ సంస్థలు పాల్గొని ఆసక్తి వ్యక్తపరిచాయని తెలిపారు. అందులో 27 అంతర్జాతీయ కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించాయని అన్నారు. మేడిన్ ఏపీ బ్రాండ్ పై పెట్టుబడిదారుల ఆసక్తి గత సంవత్సరంతో పోలిస్తే 37% అధికమైందని అన్నారు. నెల్లూరు సహా దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలకు రాబోయే ప్రాజెక్టుల వల్ల 18 లక్షల ఉద్యోగాలు, కొత్త పరిశ్రమలు, సప్లై చేయి విస్తరణ, ఎగుమతి అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు. సంస్థలతో ప్రభుత్వం జరిపిన సమన్వయం, పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతులు ఇవన్నీ పెట్టుబడిదారులకు ఏపీ పై మరింత విశ్వాసాన్ని కలిగించాయి అని పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన సీఐఐ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమల స్వర్ణయుగం ప్రారంభమయ్యే సంకేతం అని, కూతమి ప్రభుత్వం బంగారు అవకాశాలు తీసుకొచ్చింది అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలు రాబోయే సంవత్సరంలో ఏపీని దేశంలో అగ్ర పారిశ్రామిక రాష్ట్రంగా నిలబెట్టనున్నాయని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed